Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-13 10:43:05
గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఖైరతాబాద్‌లో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేయ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. 10 నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారు. తెలంగాణ ఏం కోల్పోలేదు, పెద్దాయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామకపత్రాలు అందించామన్నారు. నియామకాల ప్రక్రియ త్వరగా చేపట్టేలా పర్యవేక్షించాం అని రేవంత్ వివరించారు.