Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-13 10:37:08
పథకం ప్రకారం కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనపై మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతులను సభాస్థలికి రాకుండా అడ్డగించారు. రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలసుకుందామని కలెక్టర్ ప్రయత్నించారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులెవరో విచారణ చేస్తాం. ఉన్నతాధికారులను గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరనే దానిపై విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించం. అప్రజాస్వామికంగా దాడులు చేస్తే సహించం. అధికారం రాలేదనే ఆక్రోశంతో బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోంది. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అడ్డుకునేందుకు యత్నిస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభిప్రాయాలు, సూచనలు తెలియజేశాం. గతంలో బీఆర్‌ఎస్ విధానాలు నచ్చకపోతే న్యాయ పోరాటం చేశాం. మేం ఎప్పుడూ ఇలాంటి ఘటనలకు పాల్పడలేదు. పరిశ్రమల విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఉన్నతాధికారులపై దాడిలో ఎవరి కుట్ర ఉందో తేలుస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఎవరూ అడ్డుపడుతున్నారో తేలుస్తాం అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.