Category : | Sub Category : నేర Posted on 2024-02-21 10:53:30
TWM News : వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తానూ అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళతో కలవాలంటే ఆమె భర్తగా అడ్డుగా ఉన్నాడన్న కోపంతో గొడ్డలితో నరికి చంపేశాడో కామాంధుడు. ఇంట్లోకి జొరబడి నిద్రిస్తున్న వ్యక్తిని, అతని భార్య కళ్ళ ముందే అత్యంత పాశవికంగా నరికి చంపేశాడు. అదే సమయంలో అడ్డుకోబోయిన ప్రియురాలిని సైతం గాయపర్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో హతమార్చాడు దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామంలో జరిగింది. మారంరెడ్డి కాశీరామిరెడ్డి (30) అనే వ్యక్తి మీనిగ వెంకటేశ్వర్లు భార్య తిరుపతమ్మతో అనైతిక సబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి విషయం తెలిసిన వెంకటేశ్వర్లు పలుమార్లు హెచ్చరించాడు. దీంతో తమ సుఖానికి తిరుపతమ్మ భర్త వెంకటేశ్వర్లు అడ్డంగా ఉన్నాడని కుట్ర పన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే పక్క ఫ్లాన్‌తో వచ్చిన కాశీరామిరెడ్డి.. ఏకంగా తిరుపతమ్మ ఇంట్లోకి జొరపడ్డారు. అదే సమయంలో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లును గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అడ్డు వచ్చిన మృతుని భార్యను తీవ్రంగా గాయపరిచి అక్కడ నుండి పరారయ్యాడు. గాయాలైన తిరుపతమ్మను గమనించిన స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై పోలీస్ సిబ్బందితో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన నిందితుడు కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించుకున్నారు. ఈ హత్యలో తిరుపతమ్మ ప్రమేయం కూడా ఉందా… అన్న అనుమానంతో విచారిస్తున్నారు.