Responsive Header with Date and Time

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. ఏకంగా ఇంటికి వచ్చిన పోలీసులు..!

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-13 09:50:33


వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. ఏకంగా ఇంటికి వచ్చిన పోలీసులు..!

TWM News:-ఈనెల 19న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై పోలీస్‌ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్‌ 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రంబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రాజకీయాల నేపధ్యంలో రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్‍కు ముందే వివాదాలకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు రూపొందించిన ఈ సినిమా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తూ నిర్మించారు. ఈ వ్యూహం సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతోనే రాజకీయ దూమారాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విడుదలను ఆపాలని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్‌ను తొలుత తెలంగాణా హైకోర్టు రద్దు చేసింది. అయితే డివిజన్‌ బెంచ్‌లో వర్మ సవాల్‌ చేయడంతో మరోసారి ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్‌బోర్డు యు సర్గిఫికెట్‌ ఇవ్వడంతో సినిమా రిలీజైంది.

దివంగత కాంగ్రెస్‌ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ క్రాష్‌లో చనిపోయిన దగ్గర నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలను నాటకీయ ఫక్కీలో రాంగోపాల్‌వర్మ తెరకెక్కించారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం, పాదయాత్ర, జగన్‌ జైలుకు వెళ్లడం లాంటి అంశాలను ముడిపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ సీఎం కావడంతో ఈ సినిమా ముగుస్తోంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: