Responsive Header with Date and Time

10రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.. లేదంటే..!

Category : రాజకీయాలు | Sub Category : రాజకీయం Posted on 2024-11-12 15:47:28


10రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.. లేదంటే..!

TWM News:-సీఎం పదవికి రాజీనామా చేయాలి.. లేదంటే 10 రోజుల్లో చంపేస్తామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగిని బెదిరించిన మహిళను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి.. లేదంటే 10 రోజుల్లో చంపేస్తామని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆరా తీస్తే, ముంబైకి చెందిన మహిళగా గుర్తించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఫోన్‌ కాల్‌ చేసిన మహిళ మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను చంపేస్తామని ముంబై పోలీసులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ముంబై ట్రాఫిక్‌ పోలీసులకు ఈ ఫోన్‌ రావడంతో అలర్టయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తే, యోగిని 10 రోజుల్లో చంపేస్తామని సదరు మహిళ పోన్‌లో బెదిరించారు. 10 రోజుల్లో ఉత్తరప్రదేశ్‌ సీఎం పదవికి యోగి రాజీనామా చేయాలని , లేదంటే చంపేస్తామని హెచ్చరించారు.

ఫోన్‌లో బెదిరించిన మహిళను థానేకు చెందిన 24 ఏళ్ల ఫాతిమా ఖాన్‌గా గుర్తించారు. బీఎస్పీ చదివిన ఫాతిమా మానసిక పరిస్థితి బాగోలేదని ముంబై పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ముంబై ఏటీఎస్‌ పోలీసులు ఫాతిమాఖాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీకి పట్టిన గతే యోగికి పడుతుందని ఫోన్‌లో బెదిరించింది ఫాతిమాఖాన్‌.

అయితే ఫాతిమాఖాన్‌ వ్యవహారంపై ముంబై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫాతిమా ఖానే ఫోన్‌ చేసిందా..? లేక ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. గత కొన్ని వారాలుగా ముంబై పోలీసులకు వివిధ వ్యక్తులను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. వీటిలో అత్యధికం సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన బెదిరింపు కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బాబా సిద్దిఖీ అనే ఎన్సీపీ నేతను గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కాల్చి చంపింది. దీంతో ముంబైలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఇదే సమయంలో సీఎం యోగిని చంపేస్తామని బెదిరింపు కాల్స్‌ రావడం సంచలనం రేపుతోంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: