Category : రాజకీయాలు | Sub Category : రాజకీయం Posted on 2024-11-12 14:53:20
TWM News:-అసదుద్దీన్ ఓవైసీ వక్ఫ్ బోర్డు విషయంలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో అన్యమతస్తులకు స్థానం లేనప్పుడు వక్ఫ్ బోర్డులో ఇతరుల ప్రమేయం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వక్ఫ్ భూములు పేద ముస్లింలకు అందాలనదే.. ప్రభుత్వ ఉద్దేశమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఐదు రాష్ట్రాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయ సేకరణ రికార్డయింది. ఇటీవల హైదరాబాద్‌లో హియరింగ్ పూర్తయింది. లేటెస్ట్‌గా టీటీడీలో కొత్త కార్యవర్గం కొలువు దీరబోతుంది. ఈ ముచ్చటకు ఆ ముచ్చటకు ఎలాంటి లింకు లేదు. కానీ లాజికల్ లంకెలతో మరోసారి కాంట్రవర్సియల్ తుట్టిని కదిపారు AIMIM చీఫ్ అసదుద్దీన్.. అదే క్రమంలో బండి సంజయ్ కూడా రివర్స్ లాజిక్‌తో అటాక్ చేశారు.. తిరుమలలో అన్యమతస్తులకు ఉద్వాసన తప్పదని టీటీడీ స్ట్రాంగ్ సంకేతాలు ఇచ్చింది. అలా టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన వచ్చిందో లేదో బోర్డు పాయింట్‌పై లాజిక్ లాగారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్?. టీటీడీలో, కాశీ బోర్డులో హిందువేతరులకు స్థానం లేనప్పుడు వక్ఫ్ బోర్డులో ఇతరుల ప్రమేయం ఎందుకని ప్రశ్నించారు. టీటీడీలో అన్యమస్తులు ఉండొద్దని చెప్తున్నారు. అలాంటప్పుడు వక్ష్ బోర్డులో నాన్ ముస్లిమ్‌లను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.. ముస్లిమేతరులను చేర్చాలనే ఉద్దేశంతోనే మోదీ సర్కార్ వక్ఫ్ బోర్డు సవరణలు తెచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
అయితే.. అసద్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు కేంద్రమంత్రి బండి సంజయ్… తిరుమల బోర్డ్‌కి, వక్ఫ్ బోర్డ్‌కి తేడా తెలియని అజ్ఞాని అసద్ అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ వైకుంఠాధీశుడు కొలువైన పరమ పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. మీరు ప్రార్ధించే మక్కా మసీదు కూడా కాదు.. అంటూ బండి సంజయ్ అసదుద్దీన్ పై మండిపడ్డారు. వక్ఫ్ భూములు పేద ముస్లింలకు చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు త్వరలోనే ప్రజల ముందుకు వస్తుందన్నారు. కాంగ్రెస్‌తో అంటకాగేందుకు MIM తంటాలు పడుతోందంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇక వీహెచ్‌పీ ప్రతినిధులు కూడా అసద్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల రిలీజియస్ అటానమస్ బాడీ, వక్ఫ్ కేంద్రం చేతిలో ఉన్న బోర్డ్ .. బారిష్టర్ ఒవైసీకీ ఆమాత్రం తెలియదా? అని ప్రశ్నించారు వీహెచ్‌పీ నేతలు..
టీటీడీ బోర్డుకు వక్ఫ్ బోర్డుకు లింక్ పెట్టి మాట్లాడితే సహించేది లేదన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. అసద్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీటీడీలో హిందువుతేరలకు స్థానం లేనప్పడు వక్ఫ్‌బోర్డులో నాన్ ముస్లిమ్‌లను ఎందుకు ఇన్‌వాల్ చేస్తారనేది అసద్ లాజిక్.. ప్రార్ధనాలయాలకు సంబంధించిన బోర్డుల్లో ఎక్కడా హిందువుల జోక్యం లేదని రివర్స్ లాజిక్ లాగుతున్నారు బీజేపీ,వీహెచ్‌పీ నేతలు.