Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-12 14:47:09
TWM News:-ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ ఆడవాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొంత మంది అందంగా కనిపించేందుకు ఎంత ఖర్చు అయినా పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో ఉండే టిప్స్‌తోనే మనం అందంగా మారవచ్చు..
ఆడవాళ్లు అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. పెళ్లైన లేడీస్ కంటే ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు అందం మీద మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఈ మేరకు మేకప్‌లు, బ్యూటీ పార్లర్ల ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్లో ఉండే ప్రాడెక్ట్స్ ఎక్కువగా ఉపయోగించే బదులు ఇంట్లో ఉండే వాటితోనే మంచి గ్లోయింగ్ లుక్ సొంతం చేసుకోవచ్చు.
ఇప్పటికే ఇంట్లో వేసుకునే ఫేస్ ప్యాక్స్ గురించి చాలానే తెలుసుకున్నాం. ఇంట్లో ఉండే పదార్థాలతోనే రకరకాల ఫేస్ ప్యాక్స్ ఎలా వేస్తారో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో చూశాం. తాజాగా మీ కోసమే మరో డైమెండ్ లాంటి ఫేస్ ప్యాక్స్ తీసుకొచ్చాం.
ఈ ప్యాక్స్ వేసుకుంటే డైమెండ్‌లా మీ ముఖం మెరిసి పోవడం ఖాయం. మరి ఆప్యాక్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాఫీ పొడిలో కొద్దిగా పెరుగు కలిపి.. ముఖానికి స్క్రబ్ వేసుకోండి. ఓ 10 నిమిషాల తర్వాత ముఖం కడిగేయాలి. ఈ స్క్రబ్‌తో ముఖంపై మచ్చలు పోతాయి.
ముఖంపై ఉండే మురికిని వదిలించడంలో పెరుగు చక్కగా పని చేస్తుంది. సహజమైన బ్లీచ్‌లా మారుతుంది. పెరుగు, కొద్దిగా తేనె తీసుకుని మిక్స్ చేయండి. ఈ ప్యాక్ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మంపై ఉండే ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
ఈ ప్యాక్ కూడా చక్కగా పని చేస్తుంది. కొద్దిగా టమాటా గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా పెరుగు కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోండి. ఓ పావు గంట తర్వాత రుద్ది ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ హైడ్రేట్‌గా మెరుస్తుంది.
( ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)