Responsive Header with Date and Time

మెదడే కాదు శరీరంలో ఈ పార్ట్‌కి కూడా జ్ఞాపక శక్తి ఉంటుందట.. పరిశోధనలో వెల్లడి

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-12 14:29:35


మెదడే కాదు శరీరంలో ఈ పార్ట్‌కి కూడా జ్ఞాపక శక్తి ఉంటుందట.. పరిశోధనలో వెల్లడి

TWM News:-జ్ఞాపకాలను భద్రంగా దాచుకునే సదుపాయం మన శరీరంలో ఒక్క మెదడుకి మాత్రమే ఉందని ఇన్నాళ్లు అందరం అనుకున్నాం.. కానీ మన బాడీలో మరో భాగం కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటుందట. ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులే స్వయంగా చెబుతున్నారు మరి.. ఆ కథేంటే ఇక్కడ తెలుసుకుందాం..

జ్ఞాపకాలు సాధారణంగా మెదడులో శాశ్వతంగా నిక్షిప్లమై ఉంటాయనే విషయం అందరికీ తెలిసు. కానీ ఈ విధంగా శరీరంలోని ఏ ఇతర భాగాలు జ్ఞాపకాలను నిల్వ చేసుకోలేవు. అయితే తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అదేంటంటే.. ఒక్క మెదడు మాత్రమేకాకుండా ఇతర శరీర భాగాలు కూడా సంగతులను గుర్తుంచుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయట. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. స్వయంగా పరిశోధకులే ఈ విషయాన్ని చెబుతున్నారు. వీరి అధ్యయనం ప్రకారం మెదడు మాత్రమే కాదు, మీ శరీరంలోని ఇతర భాగాలు కూడా జ్ఞాపకాలను నిల్వ చేస్తాయని తేలింది.

ఇతర శరీర భాగాలు జ్ఞాపకాలను ఎలా నిల్వ చేస్తాయి?

మెదడు కణాలు మెమరీ జన్యువులను సక్రియం చేస్తాయి. వాటి నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తాయి. ఇదే ప్రక్రియ శరీరంలోని ఇతర కణాలలో కూడా జరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు. వివిధ రసాయన సంకేతాలకు ప్రతిస్పందించడం, జ్ఞాపకశక్తి, అభ్యాస ప్రక్రియలు కూడా ఈ కణాలలో కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఆ పరిశోధన అధ్యయనం.. మెదడు రుగ్మతలకు చికిత్స చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన రచయిత నికోలాయ్ శరీరంలోని ఇతర కణాలు కూడా జ్ఞాపకాలను నిల్వ చేస్తాయని తెలిపారు.

మెదడు కణాల మాదిరిగానే నాన్-బ్రెయిన్‌ కణాలు కూడా ఆన్ అవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. నాన్-బ్రెయిన్‌ కణాలలో జ్ఞాపకశక్తికి సంబంధించిన జన్యువులు చురుకుగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రోటీన్‌ను ఉపయోగించారు. రసాయన సంకేతాలు పునరావృతం కావడంతో, మెదడు పని చేసే విధంగానే ఈ కణాలలోని మెమరీ జన్యువులు కూడా సక్రియం కావడం ప్రారంభించాయని కనుగొన్నారు. 2018 పరిశోధనలో కిడ్నీలను మానవ శరీరంలో రెండవ మెదడుగా పరిశోధకులు గుర్తించారు. ఇది వెన్నుపాము కంటే ఎక్కువ న్యూరాన్‌లను కలిగి ఉంటుందట. శరీరం కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది.

కిడ్నీల సంక్లిష్ట పని మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మన జీర్ణవ్యవస్థ ఆహారం జీర్ణం చేయడం మాత్రమే కాకుండా ఇది అనేక ఇతన పనులను కూడా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక అనారోగ్యం, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల చికిత్సకు దీనిని ఉపయోగించవచ్చా లేదా అన్నదానిపై మరికొంత అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: