Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-12 14:23:14
TWM News:-బియ్యం కడిగిన నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. షాంపూతో తల స్నానం చేసిన తరువాత జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. బియ్యం కడుగులో ఉండే పోషకాలు జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం తగ్గుతుంది. జుట్టుకు మెరుపు కూడా వస్తుంది. వారానికి రెండు సార్లు ఇలా చేస్తుంటే జుట్టులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
బియ్యం నీరు చర్మానికి టోనర్ గా పనిచేస్తుంది. మొదట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక కాటన్ బాల్ ను బియ్యం నీటిలో ముంచి ముఖమంతా అప్లై చేయాలి. బియ్యం నీటిలో పోషకాలు ముఖ చర్మ రంధ్రాలను బిగించి ముడుతలు లేకుండా చేస్తాయి. చర్మానికి నేచురల్ మెరుపును ఇస్తాయి. దీంతో మరింత మంచి ఫలితాలు కావాలంటే బియ్యం నీటిని 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచి వాడవచ్చు. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. పొడ చర్మం ఉన్నవారికి బియ్యం నీరు మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. స్నానానికి సిద్దం చేసుకునే నీటిలో కొంచెం బియ్యం నీరు కలపాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత స్నానం చెయ్యాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.