Responsive Header with Date and Time

పరమశివుడికి ప్రియమైన బిల్వపత్రం..ఇలా వాడితే.. సర్వ రోగాలకు సంజీవని..!

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-12 13:25:14


పరమశివుడికి ప్రియమైన బిల్వపత్రం..ఇలా వాడితే.. సర్వ రోగాలకు సంజీవని..!

TWM News:-మారేడు దళం.. బిల్వ పత్రం.. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైనది. పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే..చెంబుడు నీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలని భక్తుల విశ్వాసం. ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. అయితే ఈ మారేడు దళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

మారేడులో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మారేడు ఆకులు.. ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో బెల్‌పత్రి తింటే ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మారేడు ఆకులను తీసుకుంటే, అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నిరోధించే గుణం వుంది. ఇవి గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. బిల్వ పత్రంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. బిల్వపత్రంలో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది.

బిల్వ పత్రంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తరచూ మీకు నోటిపూతతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్ పత్రి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం మీరు నాలుగు మారేడు ఆకులు తీసుకుని పచ్చిగానే నమిలి తినవచ్చు. ఇది మీ పొట్టను శుభ్రపరచడమే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

బిల్వ పత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బెల్‌పత్రిని తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు తినటం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు మరియు అలెర్జీలతో బాధపడేవారికి బెల్పత్రి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: