Responsive Header with Date and Time

నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు.. మళ్లీ తిరిగొస్తావుగా.. హీరో ఆది భార్య ఎమోషనల్.. ఏమైందంటే?

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-12 13:11:57


నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు.. మళ్లీ తిరిగొస్తావుగా.. హీరో ఆది భార్య ఎమోషనల్.. ఏమైందంటే?

TWM News:-టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీలు 2022 మేలో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ప్రేమలో మునిగి తేలిన వీరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. తాజాగా వీరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

టాలీవుడ్ క్రేజీ హీరో ఆది భార్య, హీరోయిన్‌ నిక్కీ గల్రానీల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిక్కీ ప్రాణంగా పెంచుకునే పెంపుడు కుక్క ఆదివారం చనిపోయింది. దీంతో ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ప్రాణంగా పెంచుకున్న ఛాంపియన ఇక లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్త పరిచింది నిక్కీ. వివిధ సందర్భాల్లో తన పెట్ డాగ్ తో కలిసి దిగిన ఫొటలను షేర్ చేసుకున్న ఆమె.. నీ కాలి ముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. మై బేబీ, నీ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ మంచి అబ్బాయివే! నువ్వు తొమ్మిదేళ్లుగా మాతో ఉన్నావ్. ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. కుక్కలంటే భయపడేవాళ్లు కూడా నిన్ను చూసి ప్రేమలో పడ్డారు. ఆ భయాన్ని వదిలేశారు. అందరితోనూ అంత ఫ్రెండ్లీగా, ప్రేమగా మెలిగావ్. నువ్వు మాకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది. మరోసారి కలుసుకుందాం ఛాంప్‌. ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో మళ్లీ మా దగ్గరకు తిరిగొచ్చేస్తావని ఆశిస్తున్నా అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది నిక్కీ.

ప్రస్తుతం ఆది భార్య షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారంతా రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది పినిశెట్టి. గుండెల్లో గోదారి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం, అజ్ఞాతవాసి తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: