Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-11-12 13:07:28
TWM News:-బీర్‌ను బాటిల్‌లోకి ఫిల్ చేసిన తర్వాత, సూర్యరశ్మి లిక్విడ్ బీర్‌లోకి ప్రవేశించలేకపోయింది. దాంతో బీర్ చాలా కాలం పాటు టేస్టీగా, రంగు, రచి మారకుండా ఉంది. ఇక అప్పటి నుంచి బీర్ సురక్షితంగా ఉందట. దాంతో ఈ రెండు రుంగులలో బీర్ సీసాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి.
చాలా మంది మద్యం ప్రియులు బీర్‌ని ఇష్టంగా తాగుతుంటారు. వీకెండ్ వచ్చిందంటే చాలు బీర్ కడుపులో పడాల్సిందే.! అలాంటి వారి కోసం ఒక ముఖ్యమైన సమాచారం. వివిధ బ్రాండ్‌ల బీర్‌లు వేర్వేరు రంగుల సీసాలలో వస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే, దీని వెనుక గల కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..? దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే మీరు నమ్మలేరు. కానీ, అదేంటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ వివిధ రంగుల సీసాలు సూర్య కిరణాలతో వివిధ మార్గాల్లో ప్రతిస్పందిస్తాయట.. ఇది బీర్ రుచిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పరిశీలకు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
గాజు సీసాలలో బీర్ ప్యాకింగ్ 19వ శతాబ్దం నాటిది. దీనికి కారణం గాజు సీసాలలో బీర్ చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఇది చౌకైన, అద్భుతమైన పద్ధతి. అయితే, బీర్ బాటిళ్ల రంగు కేవలం అందం కోసం, మార్కెటింగ్ కోసం మాత్రమే కాదు..ఇది బీర్ రుచి, నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విభిన్న రంగుల సీసాలు బీర్‌ను తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే, అనంతర కాలంలో స్పష్టమైన, రంగులేని గాజు సీసాలలో బీర్ నిల్వ చేయడం సరైనది కాదని గుర్తించారు.. ఎందుకంటే అటువంటి సీసాలు సూర్యరశ్మికి గురైనప్పుడు, UV కిరణాలు వేగంగా వెళ్లి.. రసాయనికంగా మార్పులు జరిగి లోపల ఉన్న బీరు రుచి, వాసనలో మార్పు వస్తుందని గుర్తించారు.
ఈ సమస్యను నివారించడానికి కంపెనీలు ఎన్నో పరిశోధనలు నిర్వహించాయి. చివరకు కాంతిని చెదరగొట్టే రంగులలో బీర్ సీసాలు తయారు చేయబడ్డాయి. గోధుమ, ఆకుపచ్చ కలర్లలో బీర్‌ను నిల్వచేయటం మొదలుపెట్టారు. బీర్‌ను బాటిల్‌లోకి ఫిల్ చేసిన తర్వాత, సూర్యరశ్మి లిక్విడ్ బీర్‌లోకి ప్రవేశించలేకపోయింది. దాంతో బీర్ చాలా కాలం పాటు టేస్టీగా, రంగు, రచి మారకుండా ఉంది. ఇక అప్పటి నుంచి బీర్ సురక్షితంగా ఉందట. దాంతో ఈ రెండు రుంగులలో బీర్ సీసాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయి.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆకుపచ్చ సీసాల వాడకం వేగంగా పెరిగింది. మార్కెట్‌లో బ్రౌన్ గ్లాస్ అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ సమయంలో, మద్యం తయారీ కంపెనీలు ఆకుపచ్చ గాజును ఉపయోగించడం ప్రారంభించాయి. ఇక అప్పటి నుంచి గోదుమ రంగు సీసాలతో పాటు ఆకుపచ్చ సీసాలలో బీరు విక్రయాలు మొదలయ్యాయని చెబుతున్నారు.. ఇక ఈ రోజు వరకు, ఈ రెండు రంగుల్లో మాత్రమే బీరు ప్రధానంగా విక్రయించబడుతోంది.