అయ్యా బాబోయ్.. ఒక్క పాట పాడితే రెహమాన్ ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..
Category : సినిమా |
Sub Category : సినిమా Posted on 2024-11-12 11:44:29
TWM News:-సినీ సంగీత ప్రపంచంలో ఆయన పేరు ఓ సెన్సేషన్. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా మ్యూజిక్ వరల్డ్ లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కింది. రోజా, బొంబాయి, రంగీలా, సఖి, తాళ్, లగాన్, రంగ్ దే బసంతి ఇలా ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు.
ఏఆర్ రెహమాన్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. అద్భుతమైన సంగీతంతో కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. మెలోడీ, మాస్ పాటలతో శ్రోతలను ఊర్రుతలూగించారు. భారతీయ సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. అతడికి ఇప్పటికే భారీగా డిమాండ్ ఉంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆస్కార్ విజేత. వేలాది సూపర్ హిట్స్ సాంగ్స్ అందించాడు. సౌత్ ఇండియాలోనూ, బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎ.ఆర్. రెహమాన్ ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటారు. నివేదికల ప్రకారం, అతను ఒక పాట పాడినందుకు దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటారట. అవును.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సింగర్లుగా పేరు తెచ్చుకున్న సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్ తదితరుల రెమ్యునరేషన్ కంటే ఇది 15 రెట్లు ఎక్కువ.
ఎ.ఆర్. రెహమాన్ ఫుల్ టైమ్ సింగర్ కాదు. సంగీత దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని అతి చిన్న వయసులోనే మొదలుపెట్టాడు. కానీ కొన్ని చిత్రాల్లో సాంగ్స్ ఆలపించాడు. ఒక్కపాటకు దాదాపు రూ.3 కోట్లు తీసుకుంటారు. కానీ రెహమాన్ ఎక్కువగా సాంగ్స్ పాడేందుకు ఆసక్తి చూపించరు. ఎందుకంటే.. అతడు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే తనను పాట పాడేందుకు ఎవరూ పిలవకుండా ఉండేందుకు అతను అంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుంటాడని సన్నిహితులు అంటుంటారు. అయినా కొందరు నిర్మాతలు అంత డబ్బు చెల్లించి రెహమాన్ చేత సాంగ్స్ పాడించారు.