Responsive Header with Date and Time

దేవర విలన్‏కు హత్య బెదిరింపులు.. సైఫ్ కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్స్..

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-12 11:23:09


దేవర విలన్‏కు హత్య బెదిరింపులు.. సైఫ్ కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్స్..

TWM News:-యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ద్వారా సౌత్ అడియన్స్ ముందుకు వచ్చాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఈ మూవీలో రావణసుర పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీలోనూ ప్రతినాయకుడిగా నటించాడు. తాజాగా సైఫ్ గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అళీ ఖాన్ ఒకప్పుడు లవర్ బాయ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో అలరించారు. ఈ హీరోకు నార్త్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్లుగా హీరోగా మెప్పిస్తున్న సైఫ్ ఇప్పుడు టర్న్ తీసుకున్నారు. విలన్ పాత్రలతో వెండితెరపై అదరగొట్టేస్తున్నారు. ఇటీవలే దేవర సినిమాలో భైరా పాత్రలో కనిపించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే దేవర పార్ట్ 2లో నటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరోలకు వరుసగా హత్యా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే వంటి హీరోలను చంపేస్తామని కొందరు ఆగంతులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు బీటౌన్ హీరోలకు రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఈ హత్య బెదిరింపులు సైఫ్ కు సైతం వచ్చాయట. కానీ ఇప్పుడు కాదు. గతంలో తన పెళ్లి జరిగిన తర్వాత వచ్చాయని అన్నారు సైఫ్.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మతాంతర వివాహం కారణంగా వీరిద్దరికి బెదిరింపులు వచ్చాయట. ఈ విషయాన్ని సైఫ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.  సైఫ్-కరీనా పెళ్లిని చాలా మంది వ్యతిరేకించారు. సైఫ్‌ను పెళ్లి చేసుకోవద్దని చాలా మంది కరీనాకు సలహా కూడా ఇచ్చారు. కానీ సైఫ్-కరీనా దేనిపైనా దృష్టి పెట్టకుండా, తమ భావాలకు ప్రాముఖ్యతనిచ్చి అక్టోబర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక వీరికి బెదిరింపులు వచ్చాయట.

మా పెళ్లిని చాలా మంది వ్యతిరేకించారు. మా బావ రణబీర్ కపూర్ కు అజ్ఞాత లేఖ వచ్చింది. అందులో మా కుటుంబాన్ని చంపేస్తామని.. మా ఇంటి దగ్గర బాంబు పెట్టి పేలుస్తామని రాశారు. కానీ అది మమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టలేదు. గతంలో కూడా మా కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో నేను ఎప్పుడూ ఆలోచించను. బెదిరింపులకు, బెదిరింపులను నిజం చేయడానికి చాలా తేడా ఉంది. మతాంతర వివాహం కావడంతో నా తల్లిదండ్రులకు కూడా అలాంటి బెదిరింపులు వచ్చాయి అని సైఫ్ చెప్పుకొచ్చారు. సైఫ్ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా మతాంతర వివాహం చేసుకున్నారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: