Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-11-12 10:32:45
TWM News:-ట్రంప్ ఎఫెక్ట్ బంగారం ధరలపై కొనసాగుతోంది. పెరిగినట్టే పెరిగి.. తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. మరి హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే.. ఆ వివరాలు ఇలా..
మగువలకు బంగారంలాంటి వార్త.. గోల్డ్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గోల్డ్ ధరలు భారీగా దిగి వస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ధరల్లో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో.. బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ బులియన్ మార్కెట్‌తో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధర..
ఢిల్లీ – రూ. 72,340
ముంబై – రూ. 72,190
కోల్‌కతా – రూ. 72,190
బెంగళూరు – రూ. 72,190
చెన్నై – రూ. 72,190
హైదరాబాద్ – రూ. 72,190
విశాఖపట్నం – రూ. 72,190
విజయవాడ – రూ. 72,190
24 క్యారెట్ల బంగారం ధర..
హైదరాబాద్ – రూ. 78,750
విశాఖపట్నం – రూ. 78,750
విజయవాడ – రూ. 78,750
ఢిల్లీ – రూ. 72,340
ముంబై – రూ. 72,190
కోల్‌కతా – రూ. 72,190
బెంగళూరు – రూ. 72,190
చెన్నై – రూ. 72,190
వెండి ధరలు..
వెండి ధరలు కూడా బంగారం బాటలో నడుస్తున్నాయి. గత రెండు రోజుల్లో సుమారు రూ. 1100 మేరకు తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం రూ. 93,000గా ఉంది. ఇక హైదరబాద్‌లో కిలో వెండి రూ. 1,01,900గా ఉంటే.. బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో కేజీ వెండి రూ. 92,900గా కొనసాగుతోంది. అటు చెన్నైలోనూ కిలో వెండి లక్ష దాటింది. ప్రస్తుతం రూ. 1,01,900గా ఉంది.