Responsive Header with Date and Time

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం.. కేంద్రం కీలక నిర్ణయం..!

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-20 18:18:49


రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం.. కేంద్రం కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌ ఔవుటర్‌ రింగ్‌రోడ్డు అవతల 347.84 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును తెలంగాణకు తలమానికంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సగం తెలంగాణ అభివృద్ధి చెందేందుకు ఇది సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడినా.. పనుల్లో కదలిక లేదు.తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులోకి రాగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ కు చిక్కుముడులు వీడుతున్నాయి. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన పైపులైన్లు, కేబుళ్లు, స్తంభాలు (యుటిలిటీస్‌) తదితరాల తరలింపు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యయం దాదాపు రూ.200 కోట్లు భరించడానికి ఒప్పుకుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం తప్పింది. ఈ వ్యయాన్ని భరించే విషయంలో జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గడచిన ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: