మూసీ వివాదంపై బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ కొత్త స్కెచ్.. సెంటిమెంటును పండిస్తున్నారా..?
Category : రాజకీయాలు |
Sub Category : రాజకీయం Posted on 2024-11-11 17:18:10
TWM News:-
మూసి విషయంలో బీఆర్ఎస్ రాజకీయాన్ని కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్ తో ఎదుర్కొంటోందట. దీనికి దీటుగా బీఆర్ఎస్ కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యాచరణను రూపొందిస్తోందట.
ఆరు నూరైనా మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మూసి పునర్జీవ సంకల్ప పాదయాత్రతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. నల్లగొండ సెంటిమెంట్ ను పండించి.. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ తన బర్త్ డే రోజున మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంటుకు దీటుగా బీఆర్ఎస్ మూసి ఎజెండాను సిద్ధం చేస్తోంది. మూసీ పాపం కాంగ్రెస్ దే అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. నల్లగొండ సెంట్రిక్ గా మూసీ పునర్జీవనం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్ గా మారింది.
మూసీ పునర్జీవనంపై కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సీఎం రేవంత్ పాల్గొన్న మూసి పునర్జీవ సంకల్ప యాత్రతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మూసీ పునర్జీవ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. మూసి ప్రక్షాళన చేసి తీరుతామని అధికార కాంగ్రెస్, అడ్డుకుంటామని బీఆర్ఎస్ ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల రాజకీయ యుద్ధం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ పునర్జీవనంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టడంతో మూసీ ప్రకంపనలు.. ఇపుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాకాయి. మూసీనది ప్రక్షాళన, పునర్జీవనంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది.