ఇవి మామూలు మూటలు కాదు.. అక్షరాల రూ.50 కోట్లు.. చూస్తే, కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Category : తెలంగాణ |
Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-11 16:52:26
గంజాయి.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ సర్కార్. ఎక్కడికక్కడ మాదకద్రవ్యాల సరఫరాకు చెక్ పెడుతోంది. పెడ్లర్లు.. కన్జూమర్ల తాట తీస్తున్నారు పోలీసులు. సప్లై నెట్‌వర్క్‌నే కాదు.. ఏకంగా మూలాల నుంచి చేధిస్తున్నాయి స్పెషల్ టీమ్స్.
తెలంగాణ వ్యాప్తంగా గత నెల రోజుల్లో పట్టుబడ్డ 50 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను దహనం చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఒక్క హైదరాబాద్‌లోనే 20 కోట్ల రూపాయల విలువైన గంజాయి, డ్రగ్స్‌ను డిస్పోజల్ చేశారు పోలీసులు.
డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చేందుకు పోలీసులు దూకుడు పెంచారు. గంజాయి.. డ్రగ్స్ నెట్వర్క్‌లను చేధిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న పెడ్లర్ల తాట తీస్తున్నారు. ముఖ్యంగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒరిస్సా బార్డర్ నుంచే నజర్ పెట్టి… సిటీలోకి గంజాయి ఎంటర్ అవకుండా నిర్మూలిస్తున్నారు పోలీసులు.