Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-11 14:38:45
TWM News:-మన నిత్యం ఉపయోగించే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లితో చర్మ, ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వెల్లుల్లి తరచూ తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పలు దీర్ఘకాలిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. వెల్లుల్లితో ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి..
ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. కానీ అందుకు ఎలాంటి ఆహారాలు తీసుకుంటారో అన్నది చాలా ముఖ్యం. పౌష్టికారమైన ఆహారం మీదనే మనిషి అందం, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకుంటే చాలు. వంటిల్లే వైద్య శాల అని ఆరోగ్య నిపుణులు ఊరికే అనలేదు. భారతీయులు తీసుకునే ఆహారం ద్వారా ఎన్నో అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎముకలు త్వరగా విరిగి పోవడం, అరిగి పోవడం లేక బలహీనంగా మారి ఏ పనీ చేయలేకపోవడం వంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే.. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలాంటి క్యాల్షియం మనకు వెల్లుల్లిలో కూడా లభిస్తుంది.
వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువ..
వెల్లుల్లిలో మనకు సల్ఫర్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకల్లోని సెల్స్ లోపలికి వెళ్లి క్యాల్షియం, ఫాస్పరస్ పంపడానికి ఉపయోగ పడుతుంది. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ అనేవి వెల్లుల్లిలో ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ఎలాంట సమస్యలు రావు.
అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు..
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మనకు అధికంగానే లభిస్తాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని కూడా తగ్గిస్తుంది.
ఎముకలు బలంగా ఉంటాయి..
వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. త్వరగా విరిగిపోవు. క్యాల్షియం ఎక్కువా పాలు, పాల పదార్థాల్లోనే లభిస్తుంది అనుకుంటారు. పాలు ఇష్టం లేని వారు ఇలా వెల్లుల్లి తీసుకున్నా కూడా సరిపోతుంది.
ఈజీగా తీసుకోవచ్చు..
వెల్లుల్లి మనకు ఈజీగానే లభిస్తుంది. అన్ని రకాల వంటల్లో వెల్లుల్లిని ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. ఎన్నో వంటల్లో భారతీయులు వెల్లుల్లిని చేర్చి వండుతారు. వెల్లుల్లితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని ఖచ్చితంగా వంటల్లో చేర్చుకోవడం మంచిది. వెల్లుల్లిని మసాలా రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)