Responsive Header with Date and Time

పట్టులాంటి మెరిసే చర్మం కోసం పసుపు నీళ్లు.. ఇలా వాడితే మొటిమలు, మచ్చలు మాయం..!

Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-11 14:26:54


పట్టులాంటి మెరిసే చర్మం కోసం పసుపు నీళ్లు.. ఇలా వాడితే మొటిమలు, మచ్చలు మాయం..!

TWM News:-పసుపులో ఉండే ఔషధ గుణాలు, పసుపు ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు అత్యంత కీలకమైన మసాలా దినుసుగా చెప్పాలి. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పసుపు ఆహారం రంగు, పోషణను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా తోడ్పడుతుంది. పసుపుతో చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయవచ్చు. మెరిసే చర్మం కోసం పసుపును ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కర్కుమిన్ మనకు ఎంతో మేలు చేస్తాయి. పసుపు చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మం కోసం, పసుపును ఉపయోగించి అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. దీనితో పాటు, మీరు ప్రతిరోజూ మీ ముఖాన్ని పసుపు నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపు నీళ్లతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కొద్ది రోజుల్లోనే తేడాను గమనిస్తారు.

పసుపు నీరు ముఖానికి మెరిసే ఛాయను కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు పసుపు నీరు చాలా ఉపయోగకరం. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు కూడా నయమవుతాయి. ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చల సమస్యను త్వరగా పరిష్కారిస్తుంది.

పసుపులో ఉండే పోషకాలు చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. చర్మం దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో పసుపు నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖంపై మచ్చలు, పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం పొందడానికి మీరు పసుపు నీటిని కూడా ఉపయోగించవచ్చు.

అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటం వల్ల మీకు కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అవి మీ అందాన్ని పాడు చేస్తాయి. అలాంటప్పుడు మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు పసుపు నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇందుకోసం ఒక లీటరు నీటిని బాగా వేడి చేసి దానికి 2 స్పూన్ల పసుపు వేసి కలపాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తరువాత స్టౌవ్‌ ఆఫ్‌ చేసి ఆ నీటిని ఫిల్టర్ చేసుకోండి. చల్లారిన తర్వాత దీన్ని ముఖానికి ఉపయోగించవచ్చు.

ముఖానికి పసుపు నీటిని అప్లై చేసే ముందు సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. తర్వాత ఈ నీటితో మీ ముఖం, చర్మాన్ని శుభ్రంగా కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే, చర్మం మంట పోతుంది. ముఖంపై మొటిమల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: