Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-11-11 14:19:38
TWM News:-ప్రముఖ డెలివరీ యాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఫుడ్ రెస్క్యూ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకి ఈ కొత్త ఫీచర్ ఉపయోగం ఏంటి.? దీనివల్ల యూజర్లకు జరిగే లబ్ధి ఎలాంటింది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫుడ్ డెలివరీ యాప్స్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొంగొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి. సంస్థలు ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అదిరిపోయే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫుడ్ రెస్క్యూ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ ఫీచర్.? దీని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను డిస్కౌంట్ ధరకు ఇతరులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జొమాటో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘ఎవరైనా యూజర్ ఫుడ్ బుక్ చేసి మధ్యలో క్యాన్సిల్ చేస్తే వెంటనే ఆర్డర్లు సమీప వినియోగదారులకు వస్తాయి. వారు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. నిమిషాల్లో వాటిని అందుకోవచ్చు.’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ కొత్త ఫీచర్‌ను ప్రతిపాదించిన వ్యక్తికి గోయల్ ఉద్యోగం కూడా ఇవ్వడం విశేషం. నో-రిఫండ్ విధానం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల నెలకు 4,00,000 కంటే ఎక్కువ ఆర్డర్లను వినియోగదారులు క్యాన్సిల్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. అనుకోని కారణాల వల్ల ఎవరైనా ఫుడ్‌ను క్యాన్సిల్ చేస్తే వెంటనే ఆ విషయాన్ని ఆర్డర్లు డెలివరీ పార్టనర్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో నివసించే కస్టమర్లకు అలర్ట్ రూపంలో వెళ్తుంది. క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ కొన్ని నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నచ్చిన వారు వాటిని డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ జాబితాలో ఐస్ క్రీం, షేక్స్, స్మూతీలు వంటివి ఉండవని అంటున్నారు. అయితే రెస్టారెంట్ భాగస్వాములు క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌కు పరిహారం పొందొచ్చు. అలాగే ఆర్డర్ క్లెయిమ్ చేస్తే కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని పొందుతారు అని గోయల్ తెలిపారు. ఫుడ్ వేస్టేజీని అరికట్టడానికి కూడా ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు.