Responsive Header with Date and Time

ప్రేమించిన యువతి దూరమైందని.. ఆమె తండ్రిపై కాల్పులు

Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2024-11-11 12:43:29


ప్రేమించిన యువతి దూరమైందని.. ఆమె తండ్రిపై కాల్పులు

TWM News:ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారని కక్షగట్టిన ఒక యువకుడు ఆమె తండ్రిపై పిస్టల్తో కాల్పులు జరిపిన ఘటన ఆదివారం సరూర్ నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ వ్యాపారికి(57) ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె పాఠశాలలో చదివేటప్పటి నుంచి ఆమె సహ విద్యార్థి, అంబర్పేటకు చెందిన గోగికార్ బల్వీర్(25) ప్రేమ పేరుతో వేధించేవాడు. ఇద్దరూ ఒకే కళాశాలలో ఇంజినీరింగ్ చదివారు. అప్పుడూ వేధింపులు ఆగలేదు. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఆరు నెలల కిందట బల్వీర్ను హెచ్చరించాడు. అప్పటి నుంచి బల్వీర్ కక్షగట్టాడు. యువతి తండ్రిని చంపేస్తానని స్నేహితులతో చెప్పేవాడు. కొన్నిరోజుల కిందట ఆమె ఇంటికెళ్లి గొడవకు దిగాడు. చంపేస్తానంటూ ఆమె తండ్రిని బెదిరించాడు. ఈ నేపథ్యంలో కుమార్తెను ఆయన ఇటీవల విదేశాలకు పంపించారు. ఆమెను తనకు దక్కకుండా చేస్తున్నారని పగ పెంచుకున్న బల్వీర్ ఆదివారం ఆ యువతి నివాసానికి వెళ్లాడు. యువతి తండ్రిపై ఎయిర్ పిస్టల్తో ఒక రౌండు కాల్పులు జరపగా.. ఆయన కుడి కన్నుపై గాయమైంది. తర్వాత కారు అద్దాలను ధ్వంసం చేసి.. ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులో తీసుకున్నామని ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తి క్షేమంగానే ఉన్నారని, చికిత్స పొందుతున్నారని వివరించారు. నిందితుడి నుంచి పోలీసులు ఎయిర్లైన్, ఎయిర్ పిస్టల్, పెల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో షూటింగ్ ప్రాక్టీస్ కోసం మొహంజాహి మార్కెట్లో వాటిని కొన్నట్లు సమాచారం.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: