Responsive Header with Date and Time

మీ చిన్నారులకు డైపర్స్‌ వేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-11-11 12:38:41


మీ చిన్నారులకు డైపర్స్‌ వేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

TWM News:-చిన్నారులకు డైపర్లను ఉపయోగించడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా డైపర్లను వేస్తున్నారు. అయితే డైపర్లను ఉపయోగించే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ డైపర్‌ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి.? ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పడితో పోల్చితే ప్రస్తుతం డైపర్స్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇకప్పుడు ఎక్కువగా క్లాత్‌ న్యాప్‌కిన్స్‌ ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం కంఫర్ట్‌ కోసం ఎక్కువగా డైపర్స్‌ను ఉపయోగిస్తున్నారు. వాకడం సులభంగా ఉండడం, తక్కువ ధరకే లభిస్తుండడంతో చాలా మంది వీటికి మొగ్గు చూపుతున్నారు. అయితే డైపర్స్‌ను ఉపయోగించే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి డైపర్స్‌తో పోల్చితే క్లాత్‌ న్యాప్‌కిన్స్‌ మంచివని నిపుణులు అంటున్నారు. వీటిని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టి మళ్లీ ఉపయోగించుకోవవచ్చు. దీంతో వీటి ద్వారా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వంటివి దరిచేరకుండా ఉంటాయి. అయితే డైపర్‌లో ఇలాంటి ఆప్షన్‌ ఉండదు. వీటి ద్వారా ర్యాషస్‌, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ..పిల్లలకు క్లాత్ న్యాప్కిన్స్, డైపర్ల వాడకంపై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం డైపర్లను, న్యాప్కిన్లను ఎంత సేపటికి మార్చాలనే విషయాలను తెలిపారు. నవజాత శిశువులకు డైపర్లను, న్యాప్కిన్లను ప్రతి గంటకోసారి మార్చాలని చెబుతున్నారు. కాగా 4 నుంచి 5 నెలల పిల్లలకు ప్రతి 3 నుంచి 4 గంటలకోసారి క్లాత్ న్యాప్కిన్‌ను కచ్చితంగా మార్చాలని అంటున్నారు.

ఇక డైపర్‌ను కూడా కచ్చితంగా ప్రతీ 3 గంటలకు ఒకసారి మార్చాలని అంటున్నారు. అయితే మల విసర్జన చేస్తే మాత్రం.. డైపర్‌లోని జెల్‌తో ప్రతిచర్య జరుగుతుంది. దీంతో చిన్నారుల్లో దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మంపై దురద పెరిగి పుండ్లు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల వయసు బట్టి రోజుకు 5 నుంచి 6 డైపర్లను మార్చాలని చెబుతున్నారు. లేదా క్లాత్‌ న్యాప్‌కిన్స్‌ను ఉపయోగించాలి.

ఒకవేళ డైపర్‌లను కచ్చితంగా ఉపయోగించాల్సి వస్తే.. చిన్నారుల చర్మానికి కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఇది మంచి ల్యూబ్రికేషన్‌లాగా ఉపయోగపడి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే చిన్నారులకు తుడవానికి ఎక్కువగా వైప్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులోని ఆల్కహాల్‌ కంటెంట్‌ చర్మంపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుంది. దీనికి బదులు తడి గుడ్డను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: