Responsive Header with Date and Time

వీడు సామాన్యుడు కాదు.. తవ్వేకొద్దీ బయట పడుతున్న ఆస్తుల చిట్టా..!

Category : నేర | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2024-11-11 11:41:17


వీడు సామాన్యుడు కాదు.. తవ్వేకొద్దీ బయట పడుతున్న ఆస్తుల చిట్టా..!

TWM News:ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రెవెన్యూ అధికారి ఆస్తులు ఏసీబీ అధికారుల కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. దాదాపు సర్వీస్ అంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా రెవెన్యూ శాఖలోనే పనిచేస్తున్న ఎంఎస్ మురళి ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో తిరుపతి కలెక్టరేట్ లో పని చేస్తున్నారు. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో సస్పెన్షన్ లో ఉన్న మురళి ఆస్తుల విలువ వందల కోట్లలో ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో బయట పడుతోంది.

మురళీ ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో దాదాపు 35 కు పైగా ఆస్తులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. బెంగళూరు, పలమనేరు, మదనపల్లిల్లో ఇల్లు, తిరుపతి పరిసరాల్లో 20 కి పైగా ప్లాట్లు, ఆర్‌సీపురంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, వీ కోటలో రెండు పౌల్ట్రీ ఫామ్స్, 5 ఎకరాల మామిడి తోట, వాయల్పాడు లో వ్యవసాయ భూమి, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట వ్యవసాయ భూమి, నెల్లూరు లో స్టోన్ హోస్ పేట లో ఇంటి స్థలాలు ఉన్నట్లు గుర్తించారు.మరోవైపు అన్నమయ్య, సత్యసాయి జిల్లాలోనూ మురళి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ భావిస్తోంది. ఇవీకాకుండా 700 గ్రాముల గోల్డ్, 10 కి పైగా బ్యాంక్ ఖాతాలు, రెండు బ్యాంకు లాకర్స్ ఉన్నట్లు చెబుతున్న ఏసీబీ అధికారులు మురళీ స్నేహితుడు చిత్తూరు జిల్లా ఇనాం డీటీ శేషగిరి రావు, సర్వేయర్ చిట్టిబాబు, మదనపల్లిలో వీఆర్వో శేఖర్ ఇళ్ళలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. వందల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పేరుతో మురళీ ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు.మదనపల్లి రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళీపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మురళిని ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. శనివారం(నవంబర్‌ 9) నుంచి ఏక కాలంలో రంగంలో దిగిన 14 టీంలు 5 జిల్లాల్లో సోదాలు కంటిన్యూ చేస్తోంది. తిరుపతిలో నాలుగు చోట్ల, మదనపల్లి, పలమనేరు, వి కోట, కడప, రాయచోటి నెల్లూరులో ఏసీబీ దాడులు కొనసాగిస్తోంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: