Responsive Header with Date and Time

జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఇలా వాడితే 4 వారాల్లోనే తెల్లజుట్టుకు చెక్‌ పెట్టొచ్చు..!

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-11 10:58:08


జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఇలా వాడితే 4 వారాల్లోనే తెల్లజుట్టుకు చెక్‌ పెట్టొచ్చు..!

TWM News:-ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య తెల్ల జుట్టు. హెయిర్ డైకి బదులు కొన్ని ఆయుర్వేద మూలికలతో తెల్ల జుట్టును ఇంట్లోనే నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టు సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. పోషకాల కొరత, అధిక రసాయన ఉత్పత్తుల వాడకం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు నెరిసిపోతుంది. అధిక ఒత్తిడి, అనారోగ్యం కారణంగా జుట్టు తెల్లగా మారుతుంది. కొన్ని ఇంటి నివారణలు తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చుతాయి. అంతేకాదు..మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారు తరచు మెంతులు తీసుకుంటే బరువు తగ్గుతారు. దాంతోపాటు జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి.

మెంతులు ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలో అనేక ఔషధ గుణాలు నిండివున్నాయి. ఇది మీ జుట్టును వేర్ల నుండి నల్లగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మెంతుల్లో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందించి, నెరసిపోకుండా చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

మెంతుల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. మెంతులు నీళ్లలో నానబెట్టి తాగటం అలవాటుగా చేసుకుంటే క్రమంగా మీ తెల్లజుట్టు నల్లగా మారుతుంది. దీంతో సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక చెంచా మెంతులు ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకుని ఖాళీ కడుపుతో మెంతికూర నీరు తాగాలి. దీంతో జుట్టు నల్లగా మారుతుంది.

కప్పు మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దాంతోపాటు ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు జీర్థవ్యవస్థ పనితీరుకు ఎంతగానో దోహదపడుతాయి. అలానే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: