Responsive Header with Date and Time

ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-11-11 10:50:24


ఇకపై టీమిండియాతో ఏ మ్యాచ్ ఆడబోం.. బెదిరింపులు మొదలెట్టిన పాక్

TWM News: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ గురించే చర్చ జరగుతోంది. అయితే, భారత్‌-పాక్‌ల మధ్య పరిస్థితులు మాత్రం మరింత జఠిలంగా తయారవుతున్నాయి. గత కొన్నేళ్లుగా, రెండు జట్లూ ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా రాబోయే కాలంలో మారుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఈవెంట్లలో కూడా రెండు జట్ల మధ్య పోటీ ఉండదు. దీనికి కారణం ఛాంపియన్స్ ట్రోఫీపై వివాదం, ఇప్పుడు ప్రతిష్టంభనకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. టీమిండియాను పాక్ పంపేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిరాకరించిన నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా మొండి వైఖరి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ మీడియా కథనాల ప్రకారం, భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకపోతే, రాబోయే ఏ టోర్నీలో టీమిండియాతో పాకిస్తాన్ ఆడదు.పాకిస్థాన్‌కు సందేశం..

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే, అందులో టీమిండియా పాల్గొనడంపై మొదటి నుంచి సందేహం ఉంది. భారత జట్టు గత 16-17 సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. పాకిస్థాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించిందని బీసీసీఐ ఇటీవల ఐసీసీకి ఇమెయిల్ ద్వారా తెలిపింది. ఇప్పుడు ఐసీసీ భారత బోర్డు ఈ వైఖరి గురించి పాకిస్తాన్ బోర్డుకి ఇమెయిల్‌లో తెలియజేసింది.

భారత క్రికెట్ బోర్డు నిర్ణయంపై ఐసీసీ నుంచి తమకు సమాచారం అందిందని పీసీబీ నవంబర్ 10 ఆదివారం తెలిపింది. ఐసీసీ నుంచి పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ మెయిల్ పంపామని, ప్రభుత్వం నుంచి సలహాలు కోరామని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు మించి పాకిస్థాన్ బోర్డు ఏమీ చెప్పలేదు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోంది.పాక్ జర్నలిస్ట్ ఫైజాన్ లఖానీ, ‘X’ లో ఒక పోస్ట్‌లో భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే వరకు, రాబోయే ఏ టోర్నమెంట్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించదని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నాడు. ఆ టోర్నీలోని నాకౌట్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడితే, ఆ మ్యాచ్‌ని కూడా పాక్ జట్టు ఆడేందుకు నిరాకరిస్తుందని తెలుస్తోంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: