Responsive Header with Date and Time

వరుణ్ చక్రవర్తి ఆగమనం.. మాస్ కమ్ బ్యాక్ అంటే ఇదే..

Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2024-11-11 10:29:07


 వరుణ్ చక్రవర్తి ఆగమనం.. మాస్ కమ్ బ్యాక్ అంటే ఇదే..

TWM News:భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కెరీర్‌లో పెద్ద మలుపు తిరిగింది. వరుణ్ చక్రవర్తి 2021 సంవత్సరంలో టీమ్ ఇండియాకు అరంగేట్రం చేశాడు. దీని తర్వాత అతను 2021 T20 ప్రపంచ కప్‌లో కూడా భాగమయ్యాడు. కానీ ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ వరుణ్ చక్రవర్తి ఇటీవల 3 సంవత్సరాల తర్వాత దేశీయ క్రికెట్, ఐపీల్లో నిలకడగా రాణించి భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై తన కెరీర్‌లో అత్యుత్తమ స్పెల్ బౌలింగ్ చేశాడు.దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేశాడు. అతను తన 4 ఓవర్ల స్పెల్‌లో 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 5 వికెట్లను తీశాడు. రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వంటి పెద్ద బ్యాట్స్‌మెన్‌ల వికెట్లను వరుణ్ చక్రవర్తి పడగొట్టాడు. దీంతో టీ20 మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత స్పిన్నర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఘనత సాధించారు. అదే సమయంలో దక్షిణాఫ్రికాపై 5 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు.

2021లో శ్రీలంక పర్యటనలో వరుణ్ చక్రవర్తి తన అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం అతను మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు, కానీ అతను కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత మూడేళ్లపాటు టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ సంవత్సరం అతను పునరాగమనం చేయగలిగాడు. ప్రతి మ్యాచ్‌లో జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: