Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-11-11 10:12:11
TWM News:-ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఇందుకు అనుగుణంగానే ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. యాక్టీవా ఈవీ పేరుతో ఈ స్కూటీని లాంచ్ చేయనున్నారు. ఇంతకీ స్కూటీ ఎప్పుడు లాంచ్ కానుంది.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి..
హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డుపై నాలుగు స్కూటీలు కనిపిస్తే అందులో కచ్చితంగా రెండు హోండా యాక్టివాలే ఉంటాయనడంలో సందేహం లేదు. కేవలం పెద్ద వారిని మాత్రమే కాకుండా యూత్‌ను కూడా ఈ స్కూటీలు తెగ ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచింగ్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్ నెలలోనే ఈ స్కూటీ మార్కెట్లోకి రానుంది. గత కొన్ని రోజులుగా ఈ స్కూటీకి సంబంధించిన వార్తలు వస్తున్న వేళ తాజాగా ఎట్టకేలకు అధికారిక ప్రకటన చేసేశారు. నవంబర్ 27వ తేదీన ఈ స్కూటీని మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. కళ్లు చెదిరే ఫీచర్లతో ఈ స్కూటీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇది వరకే తెలిపింది.
ఇక ఈ స్కూటర్ రేంజ్ విషయానికొస్తే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటీలో స్వాపబుల్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక స్కూటీలో సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్‌ను అందించనున్నారని సమాచారం. ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులు ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే ఈ స్కూటర్‌కు సంబంధించి వచ్చిన ఫొటోలు వెహికిల్‌పై అంచనాలను పెంచేసింది. అయితే జపాన్‌లో లాంచ్ అయిన స్కూటీనే భారత్‌లో తీసుకొస్తారా.? ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ స్కూటీలో 7 ఇంచెస్ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఎల్ఈడీ లేదా టీఎఫ్టీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఈ స్క్రీన్‌లో రేంజ్, మోడ్, టైమ్, డేట్, వెదర్, బ్యాటరీ ఇంకెన్ని కిలోమీటర్లు వస్తుంది లాంటి వివరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.