Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-20 10:31:09
TWM News :
నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ 394వ జయంతి వేడుకలను శ్రీశైలం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వందకు పైగా ద్విచక్ర వాహనాలతో శివాజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దేవస్థానం పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో గ్రామస్థులు కాషాయం కండువా, టోపీలు ధరించి శివాజీ మహరాజ్ కు జై జై జైలు కొడుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. మల్లన్న ఆలయ ముందు భాగంలో ప్రారంభమైన ఈ శోభాయాత్ర నందిమండపము, ఉద్యోగుల వసతి భవనాలు, మల్లికార్జున సదన్, శ్రీ గిరి కాలనీ, రుద్రాక్షమఠం గుండా శివాజీ స్పూర్తి కేంద్రానికి చేరుకున్నారు. శివాజీ స్పూర్తి కేంద్రంలో నిర్వహించిన సభలో చత్రపతి శివాజి మహరాజ్ చరిత్ర, హిందూ సామ్రాజ్యం ఏర్పాటుకు ఆయన చేసిన యుద్ధాలు, వీరోచిత పోటాలను కొనియాడారారు. శివాజీ జయంతి సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీచేశారు.
శ్రీశైల ఆలయ నిర్మాణంలో చత్రపతి శివాజీ పాత్రను కొనియాడాల్సిందే. ఆయన స్వయంగా శ్రీశైలం సందర్శించి ఉత్తర ద్వారంలో గోపురాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. అందుకే శివాజీ స్ఫూర్తి కేంద్రం సహా ప్రతి ఏటా ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.