Responsive Header with Date and Time

నాణ్యమైన బియ్యం.. కిలో రూ.34 లే

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-11-09 12:58:32


నాణ్యమైన బియ్యం.. కిలో రూ.34 లే

TWM News:- గతంలో మొదటి విడత ప్రారంభించగా, ఇప్పుడు రెండో విడతగా తక్కువ ధరల్లో నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌, ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా ఈ విక్రయాలను కొనసాగించనుంది ప్రభుత్వం. సామాన్యులకు అధిక ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రెండో విడతగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ రెండో విడతలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నులు బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి సేకరించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ స్టాక్‌ పూర్తయ్యే వరకు విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే మరిన్ని కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఈ విడతలో కేవలం రూ.30లకే కిలో గోధుమ పిండిని విక్రయించనున్నట్లు, ఈ పిండి ప్యాకెట్లు 5, 10 కిలోలు ఉంటాయని తెలిపారు. అలాగే కిలో బియ్యం రూ.34కే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ బియ్యం బస్తా5,10 కిలోలు ఉంటుందని తెలిపారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: