Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-16 11:03:17
TWM News :- ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర నిర్వహణ కోసం నూతనంగా నియామకమైన కమిటీ చైర్మన్ తో సహా 14 మంది సభ్యులు సమ్మక్క సారక్క దేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.. మంత్రి సీతక్క సమక్షంలో వారంతా బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు.. జాతర నిర్వహణలో మా వంతు పాత్ర పోషిస్తామని ప్రమాణం చేశారు
మేడారం మహా జాతర నిర్వాణకు అట్టహాసంగా ఏర్పాట్లుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 మహా జాతర నిర్వహణ కోసం నూతనంగా ఉత్సవ కమిటీని నియమించింది.. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా జరిగింది. తాడ్వాయి మండలం కామరం గ్రామానికి చెందిన ఆదివాసి నాయకుడు అర్రెం లచ్చు పటేల్ ను ఉత్సవ కమిటీ చైర్మన్ గా నియమించారు.. చైర్మన్ తో పాటు 14 మంది కమిటీ సభ్యులతో ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించింది.
ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర నిర్వహణ కోసం నూతనంగా నియామకమైన కమిటీ చైర్మన్ తో సహా 14 మంది సభ్యులు సమ్మక్క సారక్క దేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.. మంత్రి సీతక్క సమక్షంలో వారంతా బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు.. జాతర నిర్వహణలో మా వంతు పాత్ర పోషిస్తామని ప్రమాణం చేశారు
ఉత్సవ కమిటీలో గిరిజన – గిరిజనేతరులకు అవకాశం కల్పించిన మంత్రి సీతక్క.. పార్టీలకతీతంగా జాతర సక్సెస్ లో భాగస్వామ్యం కావాలని కోరారు.. ఉత్సవ కమిటీ నియామకాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.