Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-02-16 10:31:44
TWM News :- ఢిల్లీ అలీపూర్‌లోని దయాల్ మార్కెట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నాటికి మరణించిన వారి సంఖ్య 11కి పెరిగిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దయాల్ మార్కెట్లో గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి ముందు పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే అక్కడి డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వరుసగా ఆనుకొని ఉన్న ఎనిమిది షాపులకు మంటలు వ్యాపించాయి.
గురువారం సాయంత్రం 5:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు కాల్ వచ్చిందని, వెంటనే 22 అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచామని డీఎఫ్ఎస్ అధికారి తెలిపారు. రాత్రి 9 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చామని, ఫ్యాక్టరీ ఆవరణలో 11 కాలిపోయిన మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎక్స్ ఖాతాలో X ఒక పోస్ట్ చేశారు DFS చీఫ్ అతుల్ గార్గ్. ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని పెయింట్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. ఇందులో కొందరు డట్టమైన పొగలో కుప్పకూలిపోగా.. ఫ్యాక్టరీ లోపల చిక్కుకున్న కార్మికులు మంటల్లో కాలిపోయారు.
దీని కారణంగా తమ సిబ్బంది వీరిని రక్షించలేక పోయామని తెలిపారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని విచారాన్ని వ్యక్తం చేశారు.” గోడౌన్లలో నిల్వ ఉంచిన రసాయనాల వల్ల పేలుడు సంభవించినట్లు ప్రాధమికంగా నిర్థరించారు. గాయపడిన నలుగురు జ్యోతి (42), దివ్య (20), మోహిత్ సోలంకి (34), పోలీస్ కానిస్టేబుల్ కరంబీర్ (35)గా గుర్తించారు. వీరిని రాజా హరీశ్చంద్ర ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మృతదేహాలను బాబు జగ్జీవన్‌రామ్ ఆస్పత్రిలో భద్రపరిచామని, వాటిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.