Responsive Header with Date and Time

ఈ అడవుల్లో ఏం జరుగుతోంది.. వరుసగా చిరుత మరణాలపై జంతు ప్రేమికుల ఆందోళన.......

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-13 10:34:30


ఈ అడవుల్లో ఏం జరుగుతోంది.. వరుసగా చిరుత మరణాలపై జంతు ప్రేమికుల ఆందోళన.......

TWM News :- పెద్ద పులులు, చిరుత పులులు తరచుగా మృతి చెందుతూ ఉండటం పట్ల జంతు ప్రేమికులు బాధ వర్ణనాతీతం. యాక్సిడెంట్‎లోనో, ఇతర కారణాలతో ఇటీవల కాలంలోనే పదికి పైగా చిరుతలు మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ జోన్ ఫారెస్ట్‎లో చిరుత పులి, పెద్ద పులిలు తరచు మృతి చెందుతున్నడంతో జంతు ప్రేమికులు కలవరపడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లుటి గూడెం వద్ద కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని సుమారు సంవత్సరం వయసున్న ఆడ చిరుత మృతి చెందినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు.

మృతి చెందిన చిరుత పులి మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు పంచనామా నిర్వహించి, ఖననం చేశారు. నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వుడు ఫారెస్ట్‎లో వాహనాలు పరిమితికిమించిన వేగంతో వెళ్తున్నాయని తెలిపారు. 30 కిలోమీటర్ల స్పీడుకు మించి వెళ్లకూడదని ఫారెస్ట్‎లో బోర్డులు ఏర్పాటు చేసినా వాహనదారులు పట్టించుకోవడంలేదని అతివేగంతో వెళ్లడం కారణంగానే వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్నిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అయితే గత ఆరు సంవత్సరాల నుంచి ఆత్మకూరు నంద్యాల అటవీ డివిజన్ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వున్ ఫారెస్ట్‎లో చిరుత పులులు, పెద్ద పులులు రోడ్డు ప్రమాదంతో పాటు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నట్లు గుర్తించారు. ఇప్పటి దాకా సుమారు 10 చిరుతలు మరణించి ఉంటాయని వాటి వివరాలు అందజేశారు.

2018 మార్చ్ 28 శ్రీశైలం రేంజ్ లో నరమామిడి చెరువు వద్ద రెండు పులులు భీకరంగా పోట్లాడుకోవడంతో ఒకపులి మరణించింది.
2018 సెప్టెంబర్5 న మార్కాపురం డివిజన్ ఎర్రచెర్వు వద్ద పెద్దపులి మరణించి కనపడింది.
2018 నవంబర్ 18న గిద్దలూరు డివిజన్ రాచర్ల సమీపంలో పెద్దపులి కూన ఒకటి మరణించింది.
2019 ఏప్రిల్ 17 న నంద్యాల డివిజన్ చెలిమరేంజ్ రైల్వే ట్రాక్ పై పెద్దపులి రైలు ఢీకొని మరణించింది.
2021 నవంబర్ 12న ఒక ఆడపులి నంద్యాల డివిజన్ చెలిమ రేంజ్ రైల్వే ట్రాక్ పై మరణించి కనిపించింది.
2021మే11 న బైర్లుటి రేంజ్ లోని పిఏ పురం సెక్షన్ లో పెద్దపులి మరణించి కనిపించింది
2022 ఆగస్టు 9న ఆత్మకూరు అటవీ డివిజన్ వెలుగోడు రేంజిలో మెడకు ఉచుతో పెద్దపులి మరణించి కనిపించింది.
2023 ఏప్రిల్ 12 ఆత్మకూరు అటవీ డివిజన్ పెచ్చెరువు సెక్షన్ పరిధిలో అనుమానాస్పంగా చిరుత పులి మృతి.
తాజాగా జరిగిన బైర్లుటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి.
ఇలా రోడ్డు ప్రమాదంలో మరియు అనుమానాస్పదంగా చిరుతలు పెద్దపులులు మృతి చెందుతూ ఉండడంతో విలువైన జంతు సంపదలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: