Responsive Header with Date and Time

ఏపీలో పొత్తులపై రాని క్లారిటీ.. ఆ విషయంలో జాగ్రత్తగా బీజేపీ అడుగులు..

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-12 10:36:58


ఏపీలో పొత్తులపై రాని క్లారిటీ.. ఆ విషయంలో జాగ్రత్తగా బీజేపీ అడుగులు..

TWM News :- ఏపీలో పొత్తుల పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ, జనసేన రంగం సిద్ధం చేసుకుంటున్నా కమలనాథుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. చంద్రబాబు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినా పవన్ కల్యాణ్‌కు మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్ మెంట్ అందడం లేదు. దీంతో ఈ ట్రయాంగిల్ పొలిటికల్ పొత్తుల పంచాయితీ ముగింపు ఎప్పుడో అర్థం కాని స్థితి నెలకొంది.

ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా ఏపీలో ఇంకా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. వైసీపీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేనకు బీజేపీ అధినాయకత్వం మనసులో ఏముందో ఇంకా తెలియడం లేదు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు పొత్తులకు తాము సిద్ధమనే సంకేతాలను అధిష్టానానికి పంపారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. దీంతో పొత్తులు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా ఏ ప్రకటన వెలువడలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశమైనా ఇంకా ఏ నిర్ణయమూ వెలువడలేదు.

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటోన్న బీజేపీ సొంతంగా 370 చోట్ల గెలుస్తామంటోంది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాల్లో విజయం లభించబోతోందని కమలనాథులు జోస్యం చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయేలోకి మరిన్ని పార్టీలు రాబోతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా వెల్లడించడంతో ఏపీలో పొత్తులపై వెంటనే ప్రకటన రావొచ్చని అంతా భావించారు. అయితే గతంలో టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ తర్వాత నిందలు వేసి పొత్తు తెంచుకున్న నేపథ్యంలో అలా మరోసారి జరగకుండా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: