ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో సీఐడీ ఛార్జ్ షీట్.. పేర్కొన్న అంశాలివే..
Category : |
Sub Category : రాజకీయం Posted on 2024-02-09 10:52:52
TWM News :- అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణను ప్రధాన నిందితులుగా ఛార్జిషీట్‌లో పేర్కొంది. తమ భూములకు విలువ పెరిగేందుకు నిందితులు.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారనేది సీఐడీ చేస్తున్న ప్రధాన అభియోగం.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణను ప్రధాన నిందితులుగా ఛార్జిషీట్‌లో పేర్కొంది. తమ భూములకు విలువ పెరిగేందుకు నిందితులు.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారనేది సీఐడీ చేస్తున్న ప్రధాన అభియోగం. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్‌లను ప్రధాన నిందితులుగా పేర్కొంది ఏపీ సీఐడీ. ఈమేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. చంద్రబాబు తదితరులు.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అనుచితంగా లబ్ధి పొందాలని చూశారని ఛార్జ్ షీట్‌లో సీఐడీ పేర్కొంది. ఈ కేసులో A-1గా చంద్రబాబు, A-2గా నారాయణ ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం…సింగపూర్‌తో చేసుకున్నది తప్పుడు ఒప్పందమని ఆ ఛార్జిషీట్‌లో సీఐడీ ఆరోపించింది. గవర్నమెంటు టు గవర్నమెంట్ ఒప్పందం అన్నారని, అసలు G 2 G ఒప్పందమే జరగలేదని తన విచారణలో సీఐడీ నిర్ధారించింది.
అసలు సింగపూర్‌తో నాటి చంద్రబాబు సర్కార్ చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని పేర్కొంది. మాస్టర్ ప్లాన్ పేరుతో చట్ట విరుద్ధంగా సుర్బానా జురాంగ్‌కు నగదు చెల్లింపులు జరిగినట్లు ఛార్జిషీట్‌లో సీఐడీ పేర్కొంది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ కేపిటల్, మాస్టర్ ప్లాన్‌లను రూపొందించినట్లు ఆ ఛార్జిషీట్‌లో సీఐడీ తెలిపింది. లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్‌ను మార్చినట్లు సీఐడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. బంధువుల పేరుతో నారాయణ 58 ఎకరాలు కొన్నారని, లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌కు మేలు జరిగేలా అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని ఛార్జిషీట్‌లో దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. దీనికి బదులుగా చంద్రబాబుకు లింగమనేని ఇల్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది. ఇక లింగమనేని ల్యాండ్ బ్యాంకుకు పక్కనే హెరిటేజ్ సంస్థ 14 ఎకరాల భూములు కొన్నట్లు సీఐడీ చెబుతోంది. ఈ భూములకు విలువ పెరిగేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారనేది సీఐడీ చేస్తున్న ప్రధాన అభియోగం.