Category : | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-02-07 12:21:54
TWM News : తొలిసారిగా ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతికి చెందిన సెనేటర్ వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంట్లో కొత్త సెనేటర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. అస్ట్రేలియా పార్లమెంటులో ప్రమాణం చేసిన మొదటి వ్యక్తి ఘోష్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆరోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేయబోతున్న సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఘోష్‌కు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ శుభాకాంక్షలు తెలిపారు. “పశ్చిమ ఆస్ట్రేలియా నుండి మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ అంటూ పెన్నీ వాంగ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.