Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-05 14:34:09
TWM News :- మాడుగల : ‘‘ రా కదలి రా ’’ బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : 64 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతోంది – ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసం – ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి.. ప్రజలు గెలవాలి – సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్ లేదు – ఇలాంటి సైకో సీఎంను నా జీవితంలో చూడలేదు – బటన్ నొక్కుతున్నానని జగన్ గొప్పలు చెబుతున్నాడు – బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి? – మీపై జగన్ ఎంత భారం వేశాడో తెలుసుకోండి – ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్ రెడ్డి – కరెంట్ ఛార్జీలు పెంచి రూ.64 వేల కోట్ల భారం మోపాడు – జగన్ బటన్ నొక్కితేనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి – జగన్ బటన్ పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చింది – జగన్ బటన్ నొక్కుడుతో ప్రజలకు ఎంతో కష్టం వచ్చింది - జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8 లక్షలు నష్టపోయింది – జగన్.. జాబ్ క్యాలండర్ కు ఎందుకు బటన్ నొక్కలేదు? - జాబు రావాలంటే.. బాబు రావల్సిందే - జగన్ ఉత్తుత్తి బటన్ అని జనం గమనించాలి – జగన్.. మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు? – జగన్.. సీపీఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు? – వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు.. ఎన్ని వారాలైంది? – జగన్.. రోడ్ల బాగు కోసం బటన్ ఎందుకు నొక్కలేదు? – రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు బటన్ ఎందుకు నొక్కలేదు – డీఎస్సీ కోసం ఇన్నాళ్లు ఎందుకు బటన్ నొక్కలేదు? – మైనింగ్ బటన్ నొక్కి భూగర్భ సంపద దోచేశాడు – ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి సంపద తరలించాడు – జగన్ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయాయి – రేపు ప్రజలంతా ఒకే బటన్ నొక్కుతారు – ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం – ధనదాహంతో జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు – రుషికొండను జగన్ అనకొండలా మింగేశాడు – రుషికొండపై రూ.500 కోట్లతో జగన్ ప్యాలస్ కట్టుకున్నాడు - సాక్షి పేపర్ మాత్రం రూ.1000 కోట్లు కట్టబెట్టాడు – సలహాదారులకు రూ. వందల కోట్లు దోచిపెట్టారు – ఒక్క సజ్జలకే జగన్ రూ.150 కోట్లు దోచిపెట్టారు - విశాఖపట్నం పెట్టుబడులకు స్వర్గధామం – విశాఖలో రూ.40 వేల కోట్లు జగన్ దోచుకున్నాడు – నేను విశాఖకు తెచ్చిన కంపెనీలను జగన్ తరిమేశాడు – లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమి మింగేశాడు – విశాఖ ఉక్కుపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడు – దోచుకోవడమే తప్ప.. జగన్ కు ఉత్తరాంధ్రపై ప్రేమలేదు – విశాఖను జగన్ గంజాయి కేంద్రంగా, నేర రాజధానిగా మార్చాడు – జగన్ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? - గంజాయి అమ్ముతూ ఏపీ పోలీసులు హైదరాబాద్ లో దొరికిపోయారు – ఎంపీ కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేసి డబ్బు అడిగారు – తహసీల్దార్ రమణయ్యను ఇంట్లోకి వచ్చి చంపేశారు – తహసీల్దార్ ను చంపి చక్కగా విమానంలో వెళ్లిపోయారు – అసలు ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? – పులివెందుల రౌడీలు విశాఖను కబ్జా చేస్తున్నారు – జగన్ బంధువు అనిల్ రెడ్డి విశాఖలో కబ్జాలు చేస్తున్నారు – జగన్ రెడ్డి.. నువ్వు మా ప్రాంతానికి రావొద్దని విశాఖ జనం అంటున్నారు – ఐదేళ్లు రాజధాని లేకుండా చేసి జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోయారు – వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిచేయాలి – రెక్కలు విరిచిన మొండి ఫ్యాన్ ను జగన్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలి – ఉత్తరాంధ్రలో విజయసాయి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిల పెత్తనమేంటి? – నేను కూడా జగన్ రెడ్డి బాధితుడినే – మా అయ్యన్నపాత్రుడిపై రేప్ కేసు పెట్టారు – ఎస్సీ నేత అనితపై అట్రాసిటీ కేసు పెట్టారు – ఎందరో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు – ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తాం – 19 నుంచి 59 ఏళ్ల వయస్సు మహిళలకు నెలకు రూ.1500 - ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అందరికీ రూ.1500 – ఆడబిడ్డలను చందివిస్తే ఇంట్లోని అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం – ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - రాజకీయ బిచ్చగాళ్లు వస్తున్నారు.. మాయ మాటలు చెబుతారు – రాజకీయ బిచ్చగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి – రైతులకు సంవత్సరానికి రూ.20 వేల సాయం అందిస్తాం – టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే అర్హులకు 2 సెంట్ల స్థలాలు ఇస్తాం – టిడ్కో ఇళ్లు టీడీపీ కడితే ఆ ఇళ్లకు పిచ్చోడు రంగులేసుకున్నాడు – నిన్న సిద్ధమన్న జగన్.. నేడు సందిగ్ధంలో పడ్డాడు – వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు : టీడీపీ అధినేత చంద్రబాబు