Responsive Header with Date and Time

వై నాట్‌ 175.. దారులన్ని అటువైపే.. దెందులూరు వైసీపీ సభకు సర్వం ‘సిద్ధం’..

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-03 13:40:03


వై నాట్‌ 175.. దారులన్ని అటువైపే.. దెందులూరు వైసీపీ సభకు సర్వం ‘సిద్ధం’..

TWM News :- వైనాట్‌ 175 అంటున్న వైసీపీ మరి కొద్ది గంటల్లో ఎన్నికల యుద్ధానికి "సిద్ధం" అంటోంది. దెందులూరులో భారీ సభకు సర్వం సిద్ధం చేసింది. "సిద్ధం" సభకు వైసీపీ లీడర్లు, కేడర్‌ భారీ సంఖ్యలో తరలి వెళుతున్నారు. రాబోయే ఎన్నికలపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ కేడర్‌కు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 175 సీట్లు ఎలా గెలవాలో కార్యకర్తలకు సీఎం వివరించనున్నారు.

వైనాట్‌ 175 అంటున్న వైసీపీ మరి కొద్ది గంటల్లో ఎన్నికల యుద్ధానికి “సిద్ధం” అంటోంది. దెందులూరులో భారీ సభకు సర్వం సిద్ధం చేసింది. “సిద్ధం” సభకు వైసీపీ లీడర్లు, కేడర్‌ భారీ సంఖ్యలో తరలి వెళుతున్నారు. రాబోయే ఎన్నికలపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ కేడర్‌కు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 175 సీట్లు ఎలా గెలవాలో కార్యకర్తలకు సీఎం వివరించనున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు. 50 అసెంబ్లీ నియోజకవర్గాలు. 110 ఎకరాల్లో సభా ప్రాంగణం. 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌. హాజరు కానున్న నాలుగు లక్షల మంది కార్యకర్తలు. సభ నేపథ్యంలో జాతీయ రహదారిపై విశాఖ – హైదరాబాద్, చెన్నై – విశాఖ మార్గంలో ట్రాఫిక్‌ దారి మళ్లింపు. ఏలూరుకు సమీపంలోని దెందులూరు సహారా గ్రౌండ్స్‌లో జరుగుతున్న “సిద్ధం” సభకు భారీ ఏర్పాట్లతో సంసిద్ధం అంటోంది వైసీపీ.
రాబోయే ఎన్నికలకు వైసీపీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్న సీఎం జగన్‌ ఇప్పటికే భీమిలి సభలో ఉత్తరాంధ్ర కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. దెందులూరు సభలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వైసీపీ కేడర్‌కు ఆయన దిశానిర్దేశం చేస్తారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఎలా దూసుకుపోవాలో వివరిస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొనే సిద్ధం సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం.. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దగ్గరగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్ వే ఏర్పాటు చేశారు. ఏలూరులోని ప్రధాన రహదారులన్నీ సీఎం జగన్ ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో నిండిపోయాయి. ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటూ వైసీపీ శ్రేణులు జోష్‌తో ఉరకలు వేస్తున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి సుమారు 1000 బైకులు, 250 కార్లతో భారీ ర్యాలీగా బహిరంగ సభకు చేరనున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎలా గెలవాలనే దానిపై కేడర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ సందేశం ఇస్తారన్నారు ఎంపీ మిధున్ రెడ్డి. జగన్ తన పరిపాలన చూసి మరో సారి ఓటు వేయమని కోరుతున్నారని, దీనికి విపక్షాలు సిద్ధమా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
రాబోయే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోతున్నాయన్నారు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఇక సిద్ధం సభ తర్వాత విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయమన్నారు మరో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. మొత్తంగా ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటూ సిద్ధం సభకు తరలుతోంది వైసీపీ కేడర్‌.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: