Category : | Sub Category : క్రీడలు Posted on 2024-02-02 12:55:05
TWM Live News :- విజయవాడ నగరాన్ని ఆహ్లాద నగరంగా మారుస్తున్నరు అధికారులు. బెజవాడ వాసులకు కృష్ణ నది తీరనా ఆహ్లాదకర వాతావరణంలో సుందరమైన, విహార వనాన్ని నిర్మిస్తు్నారు. నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ శర వేగంగా పనులను చేస్తున్నారు. అది ఎక్కడో మీరే చూడండి.. కృష్ణానదిలో నిర్మిస్తున్న రిటర్నింగ్ గోడ వెంట విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. విజయవాడలో కనకదుర్గ వారధి నుంచి రామలింగేశ్వరనగర్ డీపీ స్టేషన్ వరకు 1.25 కి.మీ పొడవున పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దీనిని రూ.12.3 కోట్ల నిధులతో రూపొందిస్తున్నారు. ఇందులో రూ.7.8 కోట్లు నగరపాలక సంస్థ, రూ.4.5 కోట్లు అర్బన్ గ్రీనరీ నిధులను వినియోగిస్తున్నారు. రిటై నింగ్వాల్ వద్ద పార్కును ప్రజలకు త్వరలో అందు బాటులోకి తేవడానికి పసులు త్వరితగతిన సాగుతున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రీ కెనాఫీ, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, రోడ్లు, బెస్మెంట్ పసులు వేగంగా జరుగుతున్నాయి.
వారధి నుంచి రామలింగేశ్వనగర్ వరకు నది వెంట ట్రైనింగ్ పార్కు అనుకుని నిర్మిస్తున్న ఈ పార్కులో ఒకేసారి 250-500 మంది వరకు వాకింగ్ చేయడానికి వీలుగా వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఇంకా ఆహ్లాదాన్ని కలిగించడానికి వివిధ రకాల మొక్కలతో గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. స్వాగత ద్వారం. సైకిల్, వాకింగ్ ట్రాక్లు, వాటర్ ఫాల్స్, రక్షణగోడకు రెయిలింగ్, లైటింగ్, సిటింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో పాటు ఆధునాత సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్ద దానికి కార్పొరేషన్ రూ.7.8 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇప్పటికీ రిటైనింగ్ వార్ వెంట ఫిల్లింగ్ చేశారు. రక్షణ గోడ వెంట 21 మీటర్ల వెడల్పుతో, ఆ ప్రాంతంలో ఫిల్లింగ్ చేసి, 19 మీటర్ల మేర బండ్ ఉం తిర్చిదిద్దుతున్నారు. నగరవాసులకు కృష్ణమ్మ చెంత అహ్లాదకర వాతావరణంలో సేదతీరే అవకాశం కలగనుంది. నది వెంట గ్రీనరీతో కృష్ణమ్మ అందాలు విజయవాడ వాసులను కనువిందు చేస్తున్నాయి.
ప్రస్తుతం అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాహనాల పార్కింగ్‌కు అనువుగా స్థలాన్ని కేటాయించారు. రాత్రివేళల్లో కళ్లు మిరిమిట్లు గొలిపిలా ఆర్చీ, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లకు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరంగా, సుందరంగా పార్కును తీర్చిదిద్దుతున్నారు. ఈ రివర్ ఫ్రంట్ పార్కును 15 రోజుల్లోపు పూర్తి చేయనున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, పార్కుల్లో ఓపెన్ జిమ్, రాత్రి వేళల్లో మిరుమిట్లు గొలిపేలా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి చేస్తామని VMC కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు.