Responsive Header with Date and Time

కలెక్టర్‎కు గ్రామస్థులు ఇచ్చిన బహుమతి ఇదే... ఎన్నో ఏళ్ల కల సాకారమైన వేళ...

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-30 18:17:58


 కలెక్టర్‎కు గ్రామస్థులు ఇచ్చిన బహుమతి ఇదే... ఎన్నో ఏళ్ల కల సాకారమైన వేళ...

TWM Live News :-  అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదల సమయాల్లో వంతెనలు లేక గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు వివిధ గ్రామాల ప్రజలు. వరద సమయంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. తమ ఇబ్బందులను పలుసార్లు పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.. లంక గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు పెద్దపీట వేశారు. స్థానిక మండల పరిధిలోని మామిడి కుదురు- అప్పనపల్లి మార్గం మధ్యలో కొర్లకుంట వద్ద శిథిలా వస్థకు చేరిన వంతెనను జిల్లా పర్యటనలో గుర్తించారు. దీంతో పాటు సుమారు నాలుగు గ్రామాలకు రవాణా సౌకర్యాల్లో తీవ్ర అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. వీటి అభివృద్ది పనుల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

సుమారు 54 లక్షల మేర నిధులు సమకూర్చి బ్రిడ్జి నిర్మించారు. ఈ నూతన బ్రిడ్జ్‎కు గ్రామస్తులు హిమాన్షు శుక్లా వారిధిగా నామకరణం చేశారు. వంతెన నిర్మాణంతో పెదపట్నం పెదపట్నంలంక, అప్పనపల్లి, దొడ్డవరం ఈ నాలుగు గ్రామాలకు వరద ముంపు పూర్తిగా తప్పింది. దీంతో ఆ గ్రామస్తులు కలెక్టర్‎కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కొత్తగా నిర్మించిన వంతెనను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నారు. మండల పరిషత్ నిధుల నుండి సుమారుగా రూ.5.20 లక్షలు కేటాయించి ఈ వంతెనకి ఇరువైపులా సిసి రోడ్లను నిర్మించారు. నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు రహదారి సౌకర్యం లేక పడుతున్న ఇక్కట్లను స్వయంగా గుర్తించి ఈ అభివృద్దికి పాల్పడ్డారు కలెక్టర్ శుక్లా.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: