Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-25 18:50:04
TWM Live News : హైదరాబాద్ నగరం.. అత్యంత కాస్ట్లీ ఏరియాలో బంగ్లా. HMDA డైరెక్టరా..మజాకా.? ఆయన మాజీ డైరెక్టర్. ఆయన ఇల్లు చూస్తే ఉద్యోగం చేస్తున్నట్లు లేదు. అక్రమ సంపాదన కోసం ఉద్యోగంలో చేరినట్లు ఉంది. ఇల్లు తెరిచి చూసిన ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. నిన్న జరిపిన సోదాల్లో శివబాలకృష్ణ ఇంట్లో 40 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. 2 కిలోలకుపైగా బంగారు ఆభరణాల్ని గుర్తించారు. ఇంట్లో 40 ఐ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, విల్లాలు, ప్లాట్ల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేరుతో భారీ ఆస్తులు ఉన్నట్టు అనుమానిస్తున్న నేపథ్యంలో ఆ లెక్కలు కూడా తేల్చేందుకు ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. బినామీ చట్టం కూడా ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది. శివబాలకృష్ణను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
కడక్ కరెన్సీ.. బంగారు నగల జిగేల్.. ల్యాండ్ డాక్యుమెంట్స్.. ఆల్ టుగెదర్ కోట్లలో ఆస్తులు. నగదు, నగలతో పాటు ఖరీదైన ఫ్లాట్లు, బ్యాంక్ డిపాజిట్లు సహా బినామీ యవ్వారాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. బ్యాంక్ లాకర్స్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. 14 ఏసీబీ టీమ్స్.. 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఇంట్లో దొరికిన బంగారం, ప్లాట్స్, ఫ్లాట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్.. అన్ని కలిపి శివబాలకృష్ణ ఆస్తి 100 కోట్ల పైనే అని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు శివబాలకృష్ణ ఇంట్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన HMDA డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భారీ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొత్తం 17చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఆస్తులను శివబాలకృష్ణ కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. కుటుంబసభ్యుల సమక్షంలో నేడు బ్యాంకు లాకర్లు ఏసీబీ అధికారులు తెరవనున్నారు. బినామీల పేరిట శివార్లలో కోట్ల విలువచేసే ఆస్తుల ఉన్నట్టు గుర్తించారు. కాగా, ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను.. కాసేపట్లో వైద్యపరీక్షల కోసం ఉస్మానియాకు తరలించనున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఏసీబీ అధికారులు.