Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-25 18:22:51
TWM Live News :-రైతుబంధు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? ఇంత అహంకారమా? అని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలని ఫైరయ్యారు.
‘రైతులారా! రైతుబంధు ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో, ఓటుతో కొడతారో మీ ఇష్టం’ అని అన్నారు. చెప్పుతో కొడతానన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. బుధవారం కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గ సోషల్ మీ డియా వారియర్స్ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యా రు. పెద్ద సంఖ్యలో వచ్చిన వారియర్స్‌కు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఎం మోదీకి కలిశాకే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ వచ్చిందని గుర్తుచేశారు. ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను అణచి వేసే కుట్ర చేస్తున్నాయని తెలిపారు.