Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-01-23 19:19:26
TWM Live News : అకఎలిఒదిన్స్, హకఎస్ జరుగుతోన్న పోరులో తఎజగా ఇజ్రాయెల్కు గట్టి ఎదునుదెఴ్బ(Israel-Hamas Conflict) తగిలిఒది. హమాస్ మిలిటెంట్లు ఆర్పిజీ లాంచర్ న్ను ప్రయోగించడంతో 24 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సెంట్రల్ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు సోమవారం సైనికులు పేలుడు పదార్ధాలను అమర్చుతుండగా.. సమీపంలోని ట్యాంక్పైకి హమాస్ గ్రనేడ్ను ప్రయోగించింది. దాని ధాటికి మందుగుండు పేలిపోయింది. . యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించడం ఇదే తొలిసారి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపివేయాలంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెరగనుందని తెలుస్తోంది.
WHO చీఫ్ హెచ్చరిక : భవిష్యత్ తరాలు మనల్ని క్షమించకపోవచ్చు
ఇదిలా ఉండగా.. ఈ దాడికి కొన్ని గంటల ముందు గాణాలోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. రెండు వర్గాల మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ యుద్ధంతో గాజాలోని 85 శాతం ప్రజలు తమ సొంతప్రాంతాలను వీడాల్సి వచ్చింది. ప్రతి నలుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస గణాంకాలు వెల్లడించాయి.
అక్టోబర్ ఏడున హమాస్ ఉగ్రదాడి జరిపి, సుమారు 240 మందిని తన చెరలో బందించింది. ప్రపంచదేశాల ప్రయత్నాలతో వారిలో కొందరు విడుదల కాగా.. దాదాపు 100 మంది బందీలుగానే ఉన్నారు. వారు విడుదలయ్యే వరకు, హమాస్ పై విజయం సాధించే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. కాగా, హమాస్ చెరలో ఉన్న బందీల బంధువులు సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంటును ముట్టడించారు. ఆర్ధిక కమిటీ సమావేశం జరుగుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చారు. అక్కడ బందీలు మరణిస్తుంటే మీరు ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదని నిరసన వ్యక్తంచేశారు.