Responsive Header with Date and Time

*ఎస్.కోటలో లోకేష్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి & టీడీపీ కేడర్*

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-23 14:41:01


*ఎస్.కోటలో లోకేష్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి & టీడీపీ కేడర్*

*ఎస్.కోటలో లోకేష్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి & టీడీపీ కేడర్*


శృంగవరపుకోట మండల కేంద్రం, ఎస్.కోట గ్రామంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు యువ నాయకులు నారా లోకేష్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఎస్.కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి *శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* గారు లోకేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాతకు తగ్గ మనమడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా యువనాయకులైన నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టిన రోజు వేడుకులను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. రానున్న మరో 80 రోజులలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నా తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని కోరుకుంటూ, ఆయన నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి, యువతకు భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర స్థాయి నుండి గ్రామ వరకు గల వివిధ హోదాలలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, క్లస్టర్స్, యూనిట్ మరియు బూత్ ఇంఛార్జ్ లు అందరూ పార్టీ బలోపేతానికి మరియు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అయ్యేవరకూ విశ్రాంతి లేని శ్రామికుడిలా కష్టపడి పనిచేయాలని కోరారు. 


*ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు జీ.ఎస్.నాయుడు, ఉపాధ్యక్షులు సరిపల్లి రామకృష్ణ, శృంగవరపుకోట పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేదం మల్లేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, జడ్పీటీసీ అభ్యర్థి భీశెట్టి అరుణ, బోనంగి జ్యోతి, విశాఖ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసు, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చక్కా కిరణ్ కుమార్, నియోజకవర్గ ఐటీడీపీ ఇంఛార్జ్ అనకాపల్లి చెల్లయ్య, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వాకాడ బాల ఈశ్వర్ భరత్ (బాలు), ఎస్.కోట మండల ఐటీడీపీ అధ్యక్షులు గనివాడ బంగారు నాయుడు, బూత్ కన్వీనర్లు రొంగలి రమణ, మునగపాక అప్పారావు, ఇందాన హరగోపాల్, యువత భీశెట్టి మోహన్ కుమార్, పండు, సిండికేట్ సుబ్బారావు, గనివాడ వెంకటరమణ, వల్లయ్య, జనార్దన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: