Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-15 11:09:07
TWM News:-ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే.. రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది.. అయితే.. డయాబెటిక్ పేషెంట్స్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 4 పదార్థాలు తీసుకుంటే షుగర్ లెవెల్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే ఆరోగ్యకరమైన పదార్థాలు తినాలని, దాని వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే రక్తంలో చక్కెర శాతం పెరిగి.. అత్యవసర వైద్య పరిస్థితికి దారితీస్తుంది.. అందుకే.. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఉదయం పూట తినే కొన్ని ఆహారాల వల్ల చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెరను పెంచని అదేవిధంగా శరీరంలో శక్తిని కూడా నిర్వహించే వాటిని తినాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు ఈ నాలుగు ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తింటే షుగర్ పెరగదు..
నిమ్మరసం – ఉసిరి: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు నిమ్మకాయ, ఉసిరి రసం త్రాగాలి. ఇది అసలైన ఆల్కలీన్ డ్రింక్.. ఇది మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో రోజంతా షుగర్ లెవల్ బాగానే ఉండటమే కాకుండా జీర్ణక్రియ కూడా సజావుగా సాగుతుంది.
దాల్చిన చెక్క నీరు: దాల్చిన చెక్కను టీ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మీరు షుగర్ లెవెల్‌ను తగ్గించుకోవాలనుకుంటే, ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగడం ద్వారా కూడా షుగర్ అదుపులో ఉంటుంది. ఇది కాకుండా, దాల్చిన చెక్కను హెర్బల్ టీతో కూడా తీసుకోవచ్చు.
మొలకెత్తిన పెసలు: చక్కెరను నియంత్రించడానికి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం చాలా మంచి ఎంపికగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఉదయాన్నే చిరుతిండిగా మొలకెత్తిన పెసరపప్పును తీసుకోవాలి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది.. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు వీటిని ఉడికించి తినడం కూడా మంచిదే..
మెంతి గింజల నీరు: డయాబెటిస్ లో మెంతి నీరు ఉత్తమ ఎంపిక.. ఇది రోజులో కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక చెంచా మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఈ గింజలను నీటితో నమిలి తినండి. దీంతో బ్లడ్ షుగర్ ను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.