Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-15 11:03:45
TWM News:-ఆప్రికాట్స్ పండ్లు తినలేని వాళ్లు డ్రై ఆప్రికాట్స్ తినవచ్చు. ఇవి తియ్యగా, కాస్త పుల్లగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి రోజూ తినలేకపోయినా అప్పుడప్పుడూ తిన్నా ఆరోగ్యానికి మంచి లాభాలు అందుతాయి..
డ్రై ఆప్రికాట్స్ గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. డ్రై ఆప్రికాట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి రుచి పుల్లగా, తియ్యగా ఉంటాయి. డ్రై ఆప్రికాట్స్ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వీటిని పొడి చేసి కూడా తీసుకోవచ్చు. అజీర్తి సమస్యలను పోగొట్టడం చక్కగా పని చేస్తుంది.
డ్రై ఆప్రికాట్స్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వీటిని తినడం వల్ల తక్షణమే అలసట, నీరసం పోయి ఎనర్జీ లభిస్తుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
జీర్ణ సంబంధిత సమస్యలను పోగొట్టడంలో ఆప్రికాట్స్ ఎంతో బాగా పని చేస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో మంటను తగ్గిస్తాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల మజిల్ ఫంక్షన్ బాగా డెవలప్ అవుతుంది.
మీకు ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తినాలని అనిపించినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల క్రేవింగ్స్ అనేవి దూరం అవుతాయి. వీటిని పెరుగు, సలాడ్స్‌లో కూడా వేసి ఉపయోగించుకోవచ్చు.
స్మూతీస్, జ్యూసులు వంటివి చేసుకునేటప్పుడు వీటిని పంచదారకు బదులు గ్రైండ్ చేసి వాడుకోవచ్చు. గర్భిణీలు కూడా వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)