Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-15 10:53:04
TWM News:-కఫాలభాతి ఆసనం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కఫాలభాతి ఆసనాన్ని ఎవరైనా చేయవచ్చు. ఈ ఆసనంతో బెల్లీ ఫ్యాట్, శ్వాస కోశ సమస్యలను తగ్గించుకోవచ్చు..
యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా యోగాతో తగ్గించుకోవచ్చు. కాస్త సమయం పట్టినా నేచురల్‌గా తగ్గించడం వల్ల అన్నీ ప్రయోజనాలే.
ఈ ఆసనం వేయడం వల్ల ఊపిరి తిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కఫాలభాతి వేయడం వల్ల దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. జీవక్రియ అనేది వేగంగా పెరుగుతుంది.
ఈ ఆసనం వేయడం వల్ల ఉదరకండరాలపై కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుంది. తద్వారా బెల్లీ ఫ్యాట్ చక్కగా కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజూ ఓ పది నిమిషాలు చేసినా.. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.
కఫాలభాతి ఆసనం వేయడం వల్ల నాడీ వ్యవస్థ కూడా చక్కగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గి.. మెదడు, శరీరం రిలాక్స్ అవుతాయి. ఇమ్యూనిటీ కూడా బల పడుతుంది. ( ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)