Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-15 10:43:45
TWM News:-ప్రస్తుతం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వినియోగం భారీగా పెరిగింది. దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో రైస్ కుక్కర్లు ఉంటున్నాయి. అయితే పని సులభంగా మార్చిన రైస్ కుక్కర్లు ఆరోగ్యంపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనివార్యం మారింది. ఎంచక్కా రైస్ కుక్కర్‌లో బియ్యం కడిగి స్విఛ్ ఆన్ చేస బయటకు వెళ్తున్నారు. ఇంటికి వచ్చే లోపు వేడివేడిగా అన్నం రడీ అవుతుంది. ఒక్కసారి కూడా అటు చూడాల్సిన అవసరం లేదు. బిజీ జీవితంలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు.
అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే చాలా మంది వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇంతకీ నిజంగానే ఈ కుక్కర్లలో వండే అన్నం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందా.? ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే అన్నం ఆరోగ్యానికి మంచిది కాదని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. రైస్ కుక్కర్ తయారీకి ఉపయోగించే అల్యూమినియం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం.. అలా తయారు చేసిన ఆహారాన్ని నిల్వ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.
ఇలాంటి పాత్రల్లో వండిన ఆహారం తినడం వల్ల పొట్టలో నొప్పి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. అలాగే గుండె సమస్యలకు, కీళ్లవాతం, మధుమేహం, నడుము నొప్పి, అధిక బరువు వంటి ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు రైస్ కుక్కర్లకు బదులుగా మామూలు పాత్రలను ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే వంట గదికి మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.