Category : నేర | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2024-11-15 10:30:22
TWM News:-నల్లపాడు నుండి పేరేచర్ల వైపు బైక్ దూసుకుపోతుంది. ధనుష్ బస్సును క్యాచ్ చేయాలని బైక్ ను వేగంగా నడుపుతున్నాడు.
సకాలంలో ఆఫీసుకు చేరాలంటే, ఆ బస్సు ఎక్కాల్సిందే..! అయితే ఆ బస్సు కొద్దీ క్షణాల ముందే స్టాఫ్ దాటి వెళ్ళిపోయింది. తర్వాత బస్ స్టాఫ్ లో నైనా బస్సు అందుకోవాలనే ప్రయత్నం అ మహిళ ప్రాణాలే తీసింది. అసలేం జరిగిందంటే..!
గుంటూరుకు చెందిన భార్యాభర్తలు శ్రీకాంత్, సుస్మిత.. పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే శ్రీకాంత్ 2009లో గుండెపోటు కారణంగా చనిపోయారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో కారుణ్య నియామకం కింద సుస్మిత ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆమె పల్నాడు జిల్లా మాచర్లలోని కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఒక రూంలో ఉంటున్నారు.
అయితే ఆమె కొడుకు ధనుష్ వాత్సవ్ గుంటూరు సమీపంలోని నల్లపాడులో చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు కొడుకును చూసేందుకు సుస్మిత నల్లపాడు వచ్చి వెలుతుంటుంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే బుధవారం(నవంబర్ 13) కూడా కొడుకును చూసేందుకు నల్లపాడు వచ్చింది. గురువారం తిరిగి విధులకు హాజరయ్యేందుకు మాచర్ల వెళ్ళటానికి సిద్దమైంది. అయితే ఆమె నల్లపాడు బస్ స్టాఫ్ కు వచ్చేసరికి అప్పుడే మాచర్ల బస్సు వెళ్ళిపోయినట్లు చెప్పారు. దీంతో కొడుకు ధనుష్ తో నెక్ట్స్ స్టాఫ్ అయిన పేరేచర్లలో తనను దించాలని కోరింది. అక్కడే మాచర్ల బస్సు ఎక్కుతానని చెప్పింది. దీంతో ధనుష్ తన తల్లిని బైక్ పై ఎక్కించుకున్నాడు.