Responsive Header with Date and Time

స్వీట్స్ ఇష్టమని అతిగా తినేస్తున్నారా.! కంట్రోల్ లేకపోతే పొట్ట గుట్టలా మారిపోతుంది

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-15 10:14:42


స్వీట్స్ ఇష్టమని అతిగా తినేస్తున్నారా.! కంట్రోల్ లేకపోతే పొట్ట గుట్టలా మారిపోతుంది

TWM News:-ఒక్క ముద్ద లోపలికి వెళ్లలేని స్థితిలోనైనా సరే.. ఒక చాక్లెట్, స్వీట్‌కి మాత్రం ప్లేస్ ఇస్తారు. ఇంకా నెలసరి, ఒత్తిడి సమయంలో వాటి నుంచి అమ్మాయిలను దూరంగా ఉంచడం అసాధ్యమేనని చెప్పాలి..

కొంతమంది స్వీట్లను చూస్తే చాలు.. తినకుండా ఉండలేరు. మరికొందరైతే అర్ధరాత్రి వేళ ఆకలేసినా సరే.. ఏదో ఒక స్వీటును కడుపులో వేసేస్తుంటారు. ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతామని తెలిసినా సరే నియంత్రించుకోలేక పోతుంటారు! ముఖ్యంగా అమ్మాయిలనైతే తీపినీ దూరంగా ఉంచడం కష్టమే! ఒక్క ముద్ద లోపలికి వెళ్లలేని స్థితిలోనైనా సరే.. ఒక చాక్లెట్, స్వీట్‌కి మాత్రం ప్లేస్ ఇస్తారు. ఇంకా నెలసరి, ఒత్తిడి సమయంలో వాటి నుంచి అమ్మాయిలను దూరంగా ఉంచడం అసాధ్యమేనని చెప్పాలి! రోజూ ఇదే తీరైతేనే పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వీట్లు తినడం తగ్గించుకోవాలని అనుకునేవారికి నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు.

స్వీట్లు, చాక్లెట్లు ఇలా ఏవైనా సరే కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే నోరు కట్టేసుకోవడం సాధ్యమా చెప్పండి? అందుకే ముందుగా వీటిని కళ్లెదుట లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల మనసు అటువైపు మళ్లకుండా ఉంటుందని చెబుతున్నారు. అయినా సరే స్వీట్లు తినాలనిపిస్తే కాస్త నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు. అలా అని గ్లాసంతా ఒకేసారి పైకెత్తేయకుండా.. సిప్‌ చేస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా తాగితే తీపి తిన్న సంతృప్తే కలుగుతుందట. ఇవే కాకుండా చూయింగ్‌ గమ్‌ నమలడం, స్నేహితులతో మాట్లాడడం లేదా కాసేపు వేగంగా నడవడం లాంటివి చేయాలట. ఇవన్నీ మనసుకు ఆనందాన్ని కలిగించి దృష్టి మళ్లేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ చేసినా సరే.. ఆకలేసి మనసు తీపికేసి లాగుతోంటే మాత్రం ఏదైనా పండు, ఖర్జూరం, నట్స్‌ను తింటే సరిపోతుందని పేర్కొన్నారు. లేదంటే చక్కగా వేడినీటి స్నానం చేస్తే తీపి ఆలోచననే మాయం అవుతుందంటున్నారు.

మనసు తీపి వైపు మళ్లడం ఆకలికి, ఇష్టానికి సంబంధించిన విషయం అనుకుంటాం కానీ మానసిక కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ నిద్ర సరిగా లేకపోయినా, ఒత్తిడి పెరిగినా కూడా తీపి తినాలనిపిస్తుందని అంటున్నారు. అందుకే ఇలాంటి వాటిపై కూడా దృష్టిపెట్టాలని వివరించారు. ఈ సూచనలు పాటించడం వల్ల చాక్లెట్, స్వీట్లు మిమ్మల్ని అంతగా ఆకర్షించవని అంటున్నారు.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: